Begin typing your search above and press return to search.

ప్రభాస్ షాకింగ్ డెసిషన్.. ఆ మూవీ అంత స్పెషలా?

ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్ లో చేయనున్నారని తెలిసిందే. ఈ మూవీ షూటింగ్స్ లో పాల్గొనాలని ప్రభాస్ అనుకుంటున్నారట.

By:  Tupaki Desk   |   4 Aug 2023 11:42 AM GMT
ప్రభాస్ షాకింగ్ డెసిషన్.. ఆ మూవీ అంత స్పెషలా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ఆదిపురుష్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఆ మూవీ ఊహించిన రిజల్ట్స్ తీసుకురాలేకపోయింది. దీంతో, ప్రస్తుతం ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్, ప్రాజెక్ట్ కె లపైనే పెట్టుకున్నారు. ఇక సలార్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తైపోయింది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రాజెక్ట్ కె షూటింగ్ కొంత వరకు పూర్తయ్యింది. ఇంకా పూర్తవ్వాల్సిన పార్ట్ చాలా ఉంది.

ఈ క్రమంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆదిపురుష్ మూవీ విడుదలకు ముందే ప్రభాస్ అమెరికా వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన ఇంకా భారత్ కి రాలేదు. భారత్ కి వచ్చిన వెంటనే ప్రభాస్ ప్రాజెక్ట్ కె షూటింగ్స్ లో పాల్గొంటారని, సలార్ ప్రమోషన్స్ మొదలుపెడతారు అని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన ఈ రెండు విషయాలను పక్కన పెట్టి, మరో మూవీ పై ఫోకస్ పెడుతుండటం విశేషం.

ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్ లో చేయనున్నారని తెలిసిందే. ఈ మూవీ షూటింగ్స్ లో పాల్గొనాలని ప్రభాస్ అనుకుంటున్నారట. ఈ విషయాన్ని డైరెక్టర్ మారుతికి చెప్పారట. అయితే, ఈ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొనడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి, ఆలోగా, ఇతర క్యారెక్టర్లతో షూటింగ్ మొదలుపెడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే, ప్రభాస్ ఇంత టైట్ షెడ్యూల్ మధ్యలో ఈ రాజా డీలక్స్ కి ఇన్ని డేట్స్ ఎలా ఇచ్చారు అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ మూవీ షూటింగ్ కి ఇచ్చి డేట్స్ పూర్తయిన తర్వాత ఆయన మళ్లీ ప్రాజెక్ట్ కె షూటింగ్స్ లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా సలార్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటారట.

ఇదిలా ఉండగా, ఈ మూవీలో ప్రభాస్ లుక్ చాలా బాగుంటుందని తెలుస్తోంది. మిర్చి, డార్లింగ్ లో ప్రభాస్ ని చూసిన ఫీలింగ్ కలిగే అవకాశం ఉందట. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రాజెక్ట్ కె, సలార్ పక్కన పెట్టి మరీ, ఈ మూవీ పై ఇంత ఆసక్తి చూపిస్తున్నాడటంటే, ఈ మూవీలో ఏదో స్పెషాలిటీ ఉండే ఉంటుదనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.