Begin typing your search above and press return to search.

విశ్వక్ పాన్ ఇండియా కామెంట్స్.. ఎవరిని ఉద్దేశించి?

విశ్వక్ సేన్ ప్రతి విషయంలోనూ చాలా బోల్డ్ గా ఉంటాడు. తనకు నచ్చిన విషయాన్ని, నచ్చని విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పేస్తాడు

By:  Tupaki Desk   |   29 Aug 2023 7:14 AM GMT
విశ్వక్ పాన్ ఇండియా కామెంట్స్.. ఎవరిని ఉద్దేశించి?
X

టాలెంటెడ్ యంగ్ హీరీల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, మూవీలపై ఉన్న పిచ్చితో ఆయన ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. వరస అవకాశాలు అందుకొని ముందుకు దూసుకుపోతున్నాడు. ఇటీవల దాస్ కా దమ్కీ సినిమాతో మన ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు. అందులో నెగిటివ్ షేడ్ లోనూ నటించి షాకిచ్చాడు.

విశ్వక్ సేన్ ప్రతి విషయంలోనూ చాలా బోల్డ్ గా ఉంటాడు. తనకు నచ్చిన విషయాన్ని, నచ్చని విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. తనను ఎవరైనా విమర్శించినా, తాను ఎవరికైనా ఏదైనా సమాధానం చెప్పాలన్నా, ఏ మాత్రం భయపడడు. ఎంత మంది ముందైనా ధైర్యంగా చెప్పేస్తారు. ఇటీవల బేబీ మూవీ విషయంలో డైరెక్టర్ సాయి రాజేష్ కి ఈ విధంగానే గట్టి కౌంటర్ ఇచ్చాడు.

ఈ సంగతి పక్కన పెడితే, తాజాగా పాన్ ఇండియా మూవీల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ ఈవెంట్ కి హాజరైన ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. బేసికల్ గా మనమందరం మనకు అన్నీ తెలుసు మేథావులం అనుకుంటూ ఉంటామని , ఆ మేరకు లెక్కలు వేసుకుంటూ ఉంటామని అన్నారు. కొన్నిసార్లు మనం పాన్ ఇండియా సినిమా తీద్దాం అనుకుంటాం, కానీ అది గల్లీ సినిమా అవుతుందని, కొన్నిసార్లు చిన్న సినిమా తీస్తే, అది పాన్ ఇండియా సినిమా అవుతుందన్నారు.

కాంతార మూవీని వాళ్లు చిన్న సినిమాగా తీస్తే, పాన్ ఇండియా అయ్యిందని విశ్వక్ అన్నారు. సినిమాల పరంగా ఏది వంద కోట్లు అవుతుందో, ఏది పాన్ ఇండియా అవుతుందో ఎవరికీ తెలియదన్నారు. అయితే, తాను మాత్రం ప్రతి సినిమాకీ పాన్ ఇండియా సినిమాలాగే కష్టపడుతూ ఉంటానని చెప్పాడు. అంతేకానీ, ఇది రూ.100కోట్లు కొడతది, రూ.200కోట్లు కొడతది అని లెక్కలేసుకునే మేధావిని అయితే కాదు అని చెప్పారు. కాగా, ప్రస్తుతం విశ్వక్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

అయితే, విశ్వక్ ఈ కామెంట్స్ విజయ్ దేవర కొండను ఉద్దేశించి చేశారు అంటూ నెటిజన్లు భావిస్తున్నారు. నాని, విశ్వక్ సేన్ లాంటివారు మంచి మార్కెట్ ఉన్న హీరోలను చూసి జెలసీ ఫీలౌతున్నారని, అందుకే ఇలా అంటున్నారని మరి కొందరు అంటున్నారు. ఎక్కువ మంది విజయ్ దేవర కొండ గురించే ఈ కామెంట్స్ అని భావిస్తున్నారు. మరి, ఈ కామెంట్స్ మరో వివాదానికి దారితీసేలా ఉన్నాయి. విశ్వక్ ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.