Begin typing your search above and press return to search.

మాలివుడ్ పాన్ ఇండియా ఆశలు.. దుల్కర్ పైనే..

కానీ మలయాళ ఇండస్ట్రీ మాత్రం ఇంకా పాన్​ ఇండియా ట్రెండ్​ను ఫాలో అవ్వడంలో కాస్త వెనకపడే ఉందని చెప్పాలి.

By:  Tupaki Desk   |   22 Aug 2023 9:01 AM GMT
మాలివుడ్ పాన్ ఇండియా ఆశలు.. దుల్కర్ పైనే..
X

ఇప్పుడంతా పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ, కన్నడం.. ఇలా ఈ అన్నీ భాషల్లోనూ పదుల సంఖ్యలో పాన్‌ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. మినిమమ్ బడ్జెట్​తో రూపొందుతున్న చిత్రాలు కూడా.. పాన్‌ ఇండియా హంగులను అద్దుకుంటూ ఇండియావైడ్​గా హిట్​ అందుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ముఖ్యంగా ఈ విషయంలో బడా హీరోలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫుల్​ జోరు చూపిస్తున్నారు. తెలుగు దర్శకుడు రాజమౌళి(బాహుబలి, ఆర్​ఆర్​ఆర్) అల్లు అర్జున్(పుష్ప) వంటి వారు తెలుగు చిత్రసీమలో పాన్​ ఇండియా, పాన్ వరల్డ్​ స్థాయిలో నిలబెట్టారు. ఇక కోలీవుడ్ విషయానికొస్తే.. దర్శకుడు మణిరత్నం, రజనీకాంత్​, కమల్​హానస్​ లాంటి వారి సినిమాలు దేశవ్యాప్తంగా రిలీజై ఆ ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచుతున్నాయి. కన్నడలో ఇప్పటికే కేజీయఫ్, కాంతారా వచ్చి సెన్సేషనల్ సృష్టించాయి.

అలా సౌత్ ఇండస్ట్రీలో ఈ మూడు ఇండస్ట్రీ చిత్రాలు పాన్ ఇండియా ఆడియెన్స్​ను టార్గెట్​ చేస్తూ ఇప్పటికే తమ సత్తా ఏంటో నిరూపించాయి. కానీ మలయాళ ఇండస్ట్రీ మాత్రం ఇంకా పాన్​ ఇండియా ట్రెండ్​ను ఫాలో అవ్వడంలో కాస్త వెనకపడే ఉందని చెప్పాలి. అక్కడ ఇంకా ఫిల్మ్ మేకర్స్​ లో బడ్జెట్​, సింపుల్ చిత్రాలనే తెరకెక్కిస్తున్నారు. వారి సినిమాలు పాన్ ఇండియాను టార్గెట్​ చేసుకుని రావట్లేదు.

ఆ ఇండస్ట్రీలో దుల్కర్ సల్మాన్ మిహా ఇతర హీరోలు ఎవరూ ఇప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవ్వలేదు. ఆ మధ్యలో వచ్చిన మిన్నల్​ మురళి, 2018 వంటి చిత్రాలతో టొవినో థామస్​ హిట్ అందుకున్నప్పటికీ ఆ చిత్రాలు పాన్ ఇండియా టార్గెట్​గా తెరకెక్కలేదు. దుల్కర్​ సల్మాన్ ఇప్పటివరకు ఇతర భాషల్లో పనిచేశారు గానీ.. మాలీవుడ్ తరఫున డైరెక్ట్​గా పాన్ ఇండియా చిత్రం చేయలేదు.

తొలిసారి ఇప్పుడు దుల్కర్ కింగ్ ఆఫ్ కోతా అంటూ గ్యాంగ్ స్టర్ సినిమాతో పాన్ ఇండియా వైడ్​గా వస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదల కానుంది. చూడాలి మరి ఈ సినిమా దుల్కర్​తో పాటు మాలీవుడ్​కు ఎలాంటి హిట్​ను అందిస్తుందో, ఇతర మాలీవుడ్ ఫిల్మ్​ మేకర్స్​కు ఎలాంటి భరోసాను ఇస్తుందో... ఆ ఇండస్ట్రీని పాన్ ఇండియా రేసులో నిలబెడుతుందో లేదో.