Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా మోజు! అక్క‌డే విఫ‌ల‌మ‌వుతున్నారా?

పాన్ ఇండియా అంటే మీరేనా ...మేము పాన్ ఇండియా హీరోలం కాదా? అంటూ చాలా మంది యంగ్ హీరోలు అలాంటి ప్ర‌య‌త్నాలు చేసి చేతులు కాల్చుకున్నారు.

By:  Tupaki Desk   |   18 Oct 2023 10:30 AM GMT
పాన్ ఇండియా మోజు! అక్క‌డే విఫ‌ల‌మ‌వుతున్నారా?
X

పాన్ ఇండియా సినిమాకి మీనింగ్ చెప్పింది టాలీవుడ్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. గ‌తంలో ఇత‌ర భాష‌ల నుంచి కొన్ని సినిమాలు వివిధ భాష‌ల్లో విడ‌ద‌లై విజ‌యం సాధించ‌వ‌చ్చు. కానీ మారుతోన్న కాలానుగుణంగా పాన్ ఇండియా సినిమాకి స‌రికొత్త ఇమేజ్ ని తీసుకొచ్చింది మాత్రం తెలుగు ప‌రిశ్ర‌మ‌. జాతీయ స్థాయిలో `బాహుబ‌లి`..`ఆర్ ఆర్ ఆర్`..`పుష్ప` ..`కార్తికేయ‌-2` లాంటి సినిమాలు గొప్ప విజ‌య‌మే అందుకు సంకేతం.

'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్' ఓ ప్లానింగ్ ప్రకారం...రిలీజ్ కి ముందు బోలెడంత హంగామా చేసి రిలీజ్ చేసారు. కంటెంట్ ఉన్న సినిమాలు కాబ‌ట్టి మంచి విజ‌యం సాధించాయి. `పుష్ప‌`..`కార్తికేయ‌-2` మాత్రం ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయి అన్ని భాష‌ల్లో విజ‌యం సాధించ‌న‌వి. వీటికి పెద్ద‌గా ప్ర‌చారం కూడా చేయ‌లేదు. కేవ‌లం మౌత్ టాక్ తో జ‌నాల్ని ఆక‌ర్షించిన చిత్రాలు. అందుకే అంత గొప్ప విజ‌యం సాధించాయి అన్న‌ది వాస్త‌వం. ఆ త‌ర్వాత పాన్ ఇండియా మీనింగ్ మారిపోయింది.

పాన్ ఇండియా అంటే మీరేనా ...మేము పాన్ ఇండియా హీరోలం కాదా? అంటూ చాలా మంది యంగ్ హీరోలు అలాంటి ప్ర‌య‌త్నాలు చేసి చేతులు కాల్చుకున్నారు. ఇంకా పాన్ ఇండియా ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే ఈ సినిమాలు పాన్ ఇండియాలో వైఫ‌ల్యానికి ప్ర‌ధాన‌మైన కార‌ణాలు కొన్ని తెర‌పైకి వస్తున్నాయి. పాన్ ఇండియాలో ప్ర‌మోష‌న్ అంటే ప్ర‌క‌టించినంత వీజీ కాదు. అక్క‌డి మీడియాలో సినిమాని హైలైట్ చేయాలి. రిలీజ కి వారం..ప‌ది రోజుల ముందు నుంచే ముంబైలో తిష్ట వేసి కూర్చోవాలి.

అన్నీ మీడియా సంస్థ‌ల్లో సినిమా ప‌డాలి. అందుకు అవ‌స‌ర‌మైన స‌రంజామా అంతా ముందుగానే సిద్దం చేసుకోవాలి. ఇదంతా కూడా డ‌బ్బుతో కూడిన ప‌నే. నార్త్ బెల్ట్ లో సినిమాని ప్ర‌మోట్ చేయ‌డానికి 15 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా. చార్టెడ్ ప్లైట్స్ ..ల‌గ్జ‌రీ హోట‌ల్స్.. ఈవెంట్ మేనేజ్ మెంట్స్ తో అగ్రిమెంట్స్..ఇలా క‌నిపించ‌ని ఖ‌ర్చులు చాలానే ఉన్నాయి. యంగ్ హీరోలు కొంత‌మంది అక్క‌డ విఫ‌ల‌మ‌వుతున్నారని వినిపిస్తుంది.

రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి ప్ర‌చారానికి సంబంధించి బ‌డ్జెట్ కేటాయింపులో ఇబ్బందులు ఎదుర‌వ్వడంతో చేతులెత్తేయాల్సిన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయని తెలుస్తోంది. భ‌విష్య‌త్ లో ఖ‌ర్చులు అంత‌కంత‌కు పెరిగిపోతాయి. ఈనేప‌థ్యంలో పాన్ ఇండియా సినిమా అనేది కేవ‌లం అగ్ర హీరోల చిత్రాల‌కే సాధ్య‌మ‌య్యే ప‌ని అని కొంత మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. మిగిలిన హీరోలు హిందీ మార్కెట్ ని ప‌క్క‌న‌బెట్టి సౌత్ భాష‌ల‌పై మొగ్గు చూపితే ఖ‌ర్చుల‌తో పాటు...ఆదాయానికి అవ‌కాశంగా ఓ మార్గం క‌నిపిస్తుంద‌ని అంటున్నారు.