Begin typing your search above and press return to search.

ఖాన్‌లు క‌పూర్‌ల లాగా పాండేల రోజులు

రెడ్డిట్ లోను దీనిపై చ‌ర్చ సాగింది. పాండేను సీనియర్ చీకీ అని ఒక రెడిట‌ర్ పిలిచాడు. చాలా మంది ఈ ఆలోచనతో ఏకీభవించారు.

By:  Tupaki Desk   |   22 July 2025 11:14 PM IST
ఖాన్‌లు క‌పూర్‌ల లాగా పాండేల రోజులు
X

క‌పూర్ లు ఏలారు.. ఖాన్‌లు ఏల్తున్నారు.. ఇక‌పై పాండేలు కూడా మొద‌ల‌య్యారు...! ఇదీ ఈరోజు నెటిజ‌నుల్లో చ‌ర్చ‌. సైయారా విజ‌యాన్ని పాండేలు ఆస్వాధిస్తున్నార‌న‌డానికి ఇంత‌కంటే ఇంకేం కావాలి. ఇన్నేళ్ల‌లో చంకీ పాండే, చింకి పాండే అనే సోద‌రులు ఉన్నార‌ని కానీ, అన‌న్య పాండే వ‌ల్ల పాండే లెగ‌సీకి గుర్తింపు ద‌క్కింద‌ని కానీ చ‌ర్చించుకోలేదు. కానీ ఇప్పుడు అన‌న్య సోద‌రుడు అహాన్ పాండే కార‌ణంగా బాలీవుడ్ లో పాండే కుటుంబం ఒక‌టి ఉంద‌ని అంద‌రికీ తెలిసింది. అంత పెద్ద హిట్టు అయింది సైయారా. ఈ సినిమాతో అనితా ప‌ద్దా అనే యువ‌న‌టి కూడా తెర‌కు ప‌రిచ‌య‌మై మంచి పేరు తెచ్చుకుంది. న‌టుడిగా అహాన్ కి మంచి పేరొచ్చింది.

బాలీవుడ్ ట్రేడ్ నిపుణుడు జోగిందర్ తుతేజా చంకీ పాండే, అతడి కుమార్తె అనన్య పాండే, అహాన్ ల ఫోటోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి, ``కపూర్లు.. ఖాన్‌ల‌ ప్రపంచంలో పాండేలు సిలబస్ నుండి బయటకు వచ్చారు. నేను జోక్ చేయడం లేదు!`` అని రాశారు. చంకీ పాండే దానికి స్పందిస్తూ, హ్యాపీగా అనే అర్థంలో ఈమోజీలతో ప్ర‌తిస్పందించారు.

రెడ్డిట్ లోను దీనిపై చ‌ర్చ సాగింది. పాండేను సీనియర్ చీకీ అని ఒక రెడిట‌ర్ పిలిచాడు. చాలా మంది ఈ ఆలోచనతో ఏకీభవించారు. అయితే ఒక‌రు చంకీ పాండే కుమార్తె అన‌న్య పాండే షారూఖ్ ఖాన్ కుమార్తె కంటే మెరుగైన కెరీర్ ని క‌లిగి ఉంద‌ని, చంకీ పాండే మేనల్లుడు అమితాబ్ మనవడు కంటే మెరుగైన మొదటి సినిమాను కలిగి ఉంటాడ‌ని ఎవరూ ఊహించలేదు అని రాసాడు. అమీర్ ఖాన్ కొడుకు, బచ్చన్ మనవడు, సైఫ్ కొడుకు ఇలా చాలా మంది పెద్ద పెద్ద నేపోలు ఉన్నారు.. చిక్కీ పాండే కొడుకు పాండే కుటుంబాన్ని కూడా పట్టించుకునేలా వాళ్ళందరినీ ఓడించడం చాలా హాస్యాస్పదం. లేకపోతే వాళ్ళు ఇండస్ట్రీలో D- టైర్ స్టార్ల లాంటి వారే కావచ్చు! అని మరొకరు వ్యాఖ్యానించారు.

అయితే సుహానా ఖాన్ తో అన‌న్య పాండే పోలిక స‌రికాదు. సుహానా న‌టించిన ఒక్క సినిమా కూడా ఇంకా రిలీజ్ కాకుండా ఇలా పోల్చ‌డం స‌రైన‌ది కాదు. పాండే కుటుంబం నుంచి చిక్కీ పాండే కుమార్తె, అహాన్ సోద‌రి అల‌నా పాండే యూట్యూబ‌ర్ గా పెద్ద స‌క్సెసైన సంగ‌తి తెలిసిందే. అహాన్ పాండే క‌థానాయ‌కుడిగా మోహిత్ సూరి దర్శకత్వంలో YRF నిర్మించిన రొమాంటిక్ డ్రామా సైయారా విమర్శకులు- ప్రేక్షకుల నుండి సానుకూల సమీక్షలను పొందింది. ఇప్పుడు పాండే కుటుంబం నుంచి చంకీ పాండే, చింకీ పాండే, అన‌న్య పాండే, అల‌నా పాండే, అహ‌నా పాండే పేర్లు సినీ వార్త‌ల్లో మార్మోగుతున్నాయి.