ముద్దు వద్దన్న హీరోయిన్... మేకర్స్ ఏం చేశారంటే!
పంచాయత్ 4 లో రింకి పాత్రలో నటించిన శాన్విక మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆమె అందంతో పాటు నటనతోనూ మెప్పించింది.
By: Tupaki Desk | 1 July 2025 8:00 PM ISTసినిమాలతో పోల్చితే ఓటీటీ కంటెంట్‌లో ముద్దు సీన్స్ ఎక్కువగా ఉంటాయి. స్క్రిప్ట్‌లో అవసరం ఉన్నా లేకున్నా వెబ్ సిరీస్ అంటే ముద్దు సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉండాల్సిందే అనే ఒక అభిప్రాయం ఏర్పడింది. సెన్సార్ ఉండని ఓటీటీ కంటెంట్‌లో ముద్దు సీన్స్ శృతి మించి ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'పంచాయత్' వెబ్ సిరీస్‌లో శృతి మించిన అశ్లీల సీన్స్, ముద్దు సీన్స్ ఉండవు. తాజాగా పంచాయత్ 4 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి మూడు సీజన్‌ల మాదిరిగానే నాల్గవ సీజన్‌కి మంచి స్పందన లభించింది. నాల్గవ సీజన్ పూర్తిగా వినోదాత్మకంగా సాగుతుందని రివ్యూలు వచ్చాయి.
పంచాయత్ 4 లో రింకి పాత్రలో నటించిన శాన్విక మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆమె అందంతో పాటు నటనతోనూ మెప్పించింది. పంచాయత్ 4 మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆమె పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచాయత్ 4 గురించి మాట్లాడుతూ... ఈ వెబ్ సిరీస్ కోసం నన్ను సంప్రదించిన సమయంలో కచ్చితంగా నటించాలని అనుకున్నాను. మొదట నాకు చెప్పిన స్క్రిప్ట్‌తో పోల్చితే ఫైనల్ ఔట్ పుట్‌కి చాలా తేడా ఉంది. కొన్ని రోజుల తర్వాత కొత్త స్క్రిప్ట్‌తో రావడంతో రెండు రోజుల సమయం అడిగాను, ఆలోచించి హిట్ సిరీస్ కనుక ప్రేక్షకులకు దగ్గర కావచ్చు అనుకున్నాను. అందుకే ఓకే చెప్పాను.
షూటింగ్ సమయంలో ఒక సీన్‌లో ముద్దు పెట్టుకోవాలని చెప్పారు. కానీ నాకు ముద్దు పెట్టుకోవడం ఇబ్బంది అని చెప్పాను. తాను కంఫర్ట్‌గా లేనని గుర్తించిన వెబ్ సిరీస్ మేకర్స్ స్క్రిప్ట్‌ను మార్చారు. స్క్రిప్ట్‌లో మార్పు చేసి మరీ ఆ సీన్ తొలగించారు. ముద్దు సీన్‌కు నో చెబితే దర్శకుడు ఎలా రిసీవ్ చేసుకుంటాడో అనుకున్నాను. కానీ వారు అంతా నన్ను అర్థం చేసుకున్నారు. ముద్దు సీన్ ఇబ్బంది అయితే తొలగించేద్దాం అన్నారు. అన్నట్లుగా స్క్రిప్ట్ నుంచి ముద్దు సీన్స్‌ను తొలగించడం జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. చాలా మంది ముద్దు సీన్ కోసం హీరోయిన్‌నే మార్చిన సందర్భాలు ఉంటాయి. కానీ పంచాయత్ మేకర్స్ మాత్రం ముద్దు సీన్ ను తొలగించారు.
పంచాయత్ వెబ్ సిరీస్ మూడు సీజన్‌లతో పోల్చితే తాజాగా స్ట్రీమింగ్ అయిన పంచాయత్ 4 కి అంతకు మించి పాజిటివ్ స్పందన దక్కింది. ఈ వెబ్ సిరీస్‌లో కామెడీ ప్రధానంగా ఉండటంతో యూత్ ఆడియన్స్ తెగ చూస్తున్నారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ వెబ్ సిరీస్‌ను ఆసక్తిగా చూస్తున్నారు. సోషల్ మీడియాలో పంచాయత్ కి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వెబ్ సిరీస్‌లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ ముఖ్య పాత్రలో నటించారు. ఒక పల్లెటూరు లో జరిగే కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించడం జరిగింది. ముందు ముందు మరిన్ని పంచాయత్ సీజన్‌లు వస్తాయని ఒక ఇంటర్వ్యూలో మేకర్స్ దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ అన్నారు.
