స్టార్ డైరెక్టర్స్ కి వెయిటింగ్ తప్పదు!
దీంతో ఈ స్టార్ హీరోలంతా ఖాళీ అయ్యే వరకూ ఈ నయా డైరెక్టర్లంతా కచ్చితంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
By: Tupaki Desk | 20 April 2025 3:15 AMపాన్ ఇండియా స్టార్లు అంతా బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ 'పెద్ది' తో.. ప్రభాస్ 'పౌజీ', 'రాజాసాబ్' చిత్రాలతో.. ఎన్టీఆర్ 'వార్-2', 'డ్రాగన్' తో..బన్నీ- అట్లీ ప్రాజెక్ట్ తో ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. దీంతో ఈ స్టార్ హీరోలంతా ఖాళీ అయ్యే వరకూ ఈ నయా డైరెక్టర్లంతా కచ్చితంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ సారి ఆ వివరాల్లోకి వెళ్తే ఆర్సీ 17 సుకుమార్ దర్శకత్వంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
'పుష్ప2' రిలీజ్ కు ముందు చరణ్ ని లాక్ చేసాడు సుక్కు. కానీ మధ్యలో పెద్ది సినిమా ఉండటంతో? సుకుమార్ వెయిట్ చేయాల్సి వస్తోంది. వచ్చే ఏడాది వరకూ లెక్కలు మాష్టారుకు ఈ వెయిటింగ్ తప్పదు. అలాగే కొరటాల శివ 'దేవర' తర్వాత ఖాళీ అయిపోయాడు. 'దేవర 2' పట్టాలెక్కించాల్సి ఉండగా తారక్ బాలీవుడ్ లో 'వార్ 2' లో నటించడం... అనూహ్యంగా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ డ్రాగన్ పట్టాలెక్కించడంతో కొరటాలకు వెయిటింగ్ తప్పలేదు.
ప్రస్తుతం కొరటాల 'దేవర2' కథ చెక్కుతున్నాడు. వచ్చే ఏడాది వరకూ ఈ వెయిట్ తప్పేలా లేదు.ఇక గురూజీ త్రివిక్రమ్ కి కూడా బన్నీ నుంచి అలాంటి షాకే తగిలింది. బన్నీ హీరోగా గురూజీ ప్రాజెక్ట్ ప్రక టించినా మధ్యలోకి అట్లీ దూరడంతో? బన్నీ గురూజీని తాత్కాలికంగా పక్కన బెట్టాడు. గురూజీకి పాన్ ఇండియా చిత్రాల అనుభవం లేకపోవడంతో అతడి కంటే ముందుగా అట్లీ బెటర్ అనే ఆప్షన్ కు వెళ్లిపోయాడు.
ఏడాదిన్నర పాటు బన్నీ అట్లీ సినిమాతోనే బిజీగా ఉంటాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. 'స్పిరిట్' చిత్రాన్ని పట్టాలెక్కించాలని కొన్ని నెలలుగా అదే పనిలో ఉన్నాడు. కానీ డార్లింగ్ 'పౌజీ' షూటింగ్లో బిజీగా ఉండటంతో యానిమల్ కి వెయిటింగ్ తప్పలేదు. అలాగే నాగ్ అశ్విన్ కూడా మధ్యలోనే బ్లాక్ అయ్యాడు. 'కల్కి 2' ప్రభాస్ తో నే పట్టాలెక్కించాలని అతడు వచ్చే వరకూ నాగీ 'కల్కి 2' కథను చెక్కుతూనే ఉంటారు.