Begin typing your search above and press return to search.

మూడో భాగం అంత ఈజీ కాదు సుమా..?

ఇవన్నీ పాన్ ఇండియా హిట్ సినిమాలు కాగా డీజ్ట్ టిల్లు, టిల్లు స్క్వేర్ ఇంకా మ్యాడ్ 1, మ్యాడ్ స్క్వేర్ లు టాలీవుడ్ లో హిట్ అందుకున్నాయి.

By:  Tupaki Desk   |   19 April 2025 6:00 AM IST
మూడో భాగం అంత ఈజీ కాదు సుమా..?
X

ఒక సినిమాగా చెప్పాల్సిన కథను రెండు భాగాలు చేసి చెప్పడమే ఒక పెద్ద టాస్క్ అనిపించగా ఇప్పుడు కథను ఇంకాస్త కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు మన మేకర్స్. బాహుబలి తో రాజమౌళి చేసిన ఈ ప్రయోగం బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ తర్వాత చాలామంది అదే పంథా కొనసాగిస్తున్నారు. బాహుబలి 1,2 తర్వాత కె.జి.ఎఫ్ 1,2 వచ్చింది. ఆ తర్వాత పుష్ప 1, 2 వచ్చింది. ఇవన్నీ పాన్ ఇండియా హిట్ సినిమాలు కాగా డీజ్ట్ టిల్లు, టిల్లు స్క్వేర్ ఇంకా మ్యాడ్ 1, మ్యాడ్ స్క్వేర్ లు టాలీవుడ్ లో హిట్ అందుకున్నాయి.

ఐతే రాజమౌళి కూడా బాహుబలి సినిమాను రెండు భాగాలతో ముగించాడు. ఐతే పుష్ప కథను మాత్రం సుకుమార్ ముగించలేదు. అందుకే పుష్ప 3 పోస్టర్ వేశాడు. ఐతే ఒక కథను ఇలా కొనసాగించడం మాత్రం పుష్ప వల్లే అయ్యింది. పార్ట్ 3 కచ్చితంగా డబుల్ క్రేజ్ తో ఒక రేంజ్ బజ్ తో వస్తుంది. ఐతే పుష్ప 3 సినిమా చేయడం అన్నది అంత ఈజీ విషయం కాదు.

పుష్ప 2 క్లైమాక్స్ లో తన ఫ్యామిలీతో పుష్ప రాజ్ కలిశాడు కానీ ఏకంగా సెంట్రల్ మినిస్టర్ తోనే కయ్యాన్ని పెట్టుకున్నాడు. ఆ కథతోనే పుష్ప 3 రాబోతుంది. ఇక టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ కాగా టిల్ల్య్ క్యూబ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఐతే టిల్లు క్యూబ్ కథ ఎలా ఉంటుంది అన్నది ఆడియన్స్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంది.

రీసెంట్ గా రిలీజై సక్సెస్ అందుకున్న మ్యాడ్ స్క్వేర్ కి కూడా మ్యాడ్ క్యూబ్ ఉంటుందని తెలుస్తుంది. టిల్లు, మ్యాడ్ జస్ట్ టైటిల్ ని కొనసాగిస్తూ అదే కాస్టింగ్ తో కొనసాగిస్తున్నారు. కథలను మార్చి సీక్వెల్ గా చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ఐతే మూడో భాగం అంటే ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయడం వరకు ఓకే కానీ అదే రేంజ్ కథ కూడా ఉండాలి.

కచ్చితంగా టైటిల్ సీక్వెల్స్ ని చేస్తున్నా ఇంట్రెస్టింగ్ స్టోరీ స్క్రీన్ ప్లే ఉంటేనే ఆడియన్స్ కి ఆసక్తికరంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ మూడో భాగం సినిమాల విషయంలో మేకర్స్ లెక్క ఎలా ఉందో చూడాలి. ఇక సీక్వెల్స్ విషయానికి వస్తే దేవర 1, సలార్ 1 ల తర్వాత రాబోయే రెండేళ్లలో దేవర 2, సలార్ 2 లు రాబోతున్నాయి. ఈ సీక్వెల్స్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.