పాన్ ఇండియా హీరోల మధ్య బడ్జెట్ పోటీ!
పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోపై ఎన్ని వందల కోట్లైనా పెట్టొచ్చు అన్న ధీమా కనిపిస్తుంది.
By: Tupaki Desk | 20 April 2025 1:00 AM ISTనిన్న మొన్నటి వరకూ పాన్ ఇండియా హీరోల మధ్య రిలీజ్ పోటీ కనిపించేది. ఏ హీరో ఏ తేదీలో వస్తు న్నాడు? ఏ సంవత్సరలో రిలీజ్ అవుతున్నాడు? ఆ సినిమా వసూళ్ల అంచనాలు ఇలా కొన్ని అంశాలు ప్రముఖంగా తెరపైకి వచ్చేవి. కానీ ఇప్పుడు రిలీజ్ కు ముందే బడ్జెట్ లో నే కొందరు పాన్ ఇండియా స్టార్లు పోటీ పడుతున్నారు. `పుష్ప 2`,` కల్కి 2898` లాంటి రిలీజ్ ల తర్వాత నిర్మాతల్లో నమ్మకం పెరిగింది.
పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోపై ఎన్ని వందల కోట్లైనా పెట్టొచ్చు అన్న ధీమా కనిపిస్తుంది. అందుకు తగ్గ ప్రణాళికతోనే దర్శక, నిర్మాతలు ముందుకెళ్తున్నారు. మహేష్, బన్నీ, ప్రభాస్, ఎన్టీఆర్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రాలు కొన్ని ఆన్సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఎస్ ఎస్ ఎంబీ 29 బడ్జెట్ ఏకంగా 1000 కోట్లు పైనే అంటున్నారు. కె. ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. రాజమౌళిపై నమ్మకంతో నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెట్టుబడులు పెడుతున్నారు.
మహేష్ కి ఇదే తొలి పాన్ ఇండియా సినిమా అయినా? రాజీ పడకుండా ముందుకెళ్తున్నారు. రాజమౌళి బ్రాండ్ తో బిజినెస్కి ఢోకా ఉండదు. ఎంత పెట్టుబడి పెట్టినా? ప్రీ రిలీజ్ కే భారీ లాభాలు బాట పడతారు. అయితే ఆ నమ్మకాన్ని రిలీజ్ అనంతరం అంతే నిలబెట్టుకోవాలి. 1000 కోట్ల బడ్జెట్ సినిమా అంటే బాక్సా ఫీస్ వద్ద 3000 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నట్లే. అలాగే ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న `పౌజీ` బడ్జెట్ కూడా బయటకు వచ్చింది.
ఇందులో నటిస్తోన్న మిథున్ చక్రవర్తి ఈ సినిమా బడ్జెట్ 700 కోట్లు అని అన్నారు. ఇండియాలోనే గొప్ప చిత్రమవుతుందనే ధీమా వ్యక్తం చేసారు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న` డ్రాగన్` బడ్జెట్ కూడా 600 కోట్లు అని సమాచారం. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ భారీ టెక్నికల్ చిత్రానికి రంగం సిద్దమవుతుంది. విదేశీ కంపెనీలతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని ముందుకెళ్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా 1000కోట్లు అని ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇంకా రామ్ చరణ్ `పెద్ది`, మంచు విష్ణు `కన్నప్ప` చిత్రాలు కూడా భారీ బడ్జెట్ తో నిర్మాణం అవుతున్నవే.
