Begin typing your search above and press return to search.

స్టార్ హీరో కొడుకు గాళ్ ఫ్రెండ్ మ‌తి చెడే ట్రీట్

పాల‌క్ నిజంగా బుట్ట‌బొమ్మ‌నే త‌ల‌పించింది. త‌న అందంతో మ‌తులు చెడ‌గొట్టింది.

By:  Tupaki Desk   |   7 July 2024 5:25 AM GMT
స్టార్ హీరో కొడుకు గాళ్ ఫ్రెండ్ మ‌తి చెడే ట్రీట్
X

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ వివాహానికి స‌మ‌య‌మాస‌న్న‌మైంది. పెళ్లి సంద‌డి ఇప్ప‌టికే పీక్స్ కి చేరుకుంది. రెండు ప్రీవెడ్డింగుల త‌ర్వాత వివాహానికి ముందు ఆచారాలు పార్టీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి (జూలై 5) ముంబైలో ఈ జంట గ్రాండ్ సంగీత వేడుకను నిర్వహించారు.

ఆస‌క్తిక‌రంగా ఎంద‌రో సెల‌బ్రిటీలు అటెండ‌యిన ఈ వేడుక‌లో క‌ళ్ల‌న్నీ ఒకే ఒక్క‌రిపై నిలిచాయ‌నేది ఇన్ సైడ్ టాక్. ఆ ఒక్క‌రు ఎవ‌రు? అంటే దానికి స‌మాధానం వ‌చ్చింది. అనంత్ అంబానీ- రాధికల సంగీత్‌ వేడుకకు యువ‌న‌టి పాల‌క్ తివారీ హాజరయ్యారు. సోషల్ మీడియాలో విడుద‌లైన ఒక వీడియోలో పాల‌క్ ఫోటోగ్రాఫ‌ర్ల‌కు పోజులిస్తూ వేదిక వద్దకు రావడం కనిపించింది. పాల‌క్ నిజంగా బుట్ట‌బొమ్మ‌నే త‌ల‌పించింది. త‌న అందంతో మ‌తులు చెడ‌గొట్టింది. భారీగా ఎంబ్రాయిడరీ చేసిన ఆరెంజ్ లెహంగాను ధరించి ఎప్పటిలాగే స్ట‌న్నింగ్ గా అందంగా కనిపించింది.

అయితే తాజా వైరల్ క్లిప్‌లో పాలక్ కూడా వేదికపైకి వెళుతూ బ్యాలెన్స్ కోల్పోవడం కనిపించింది. పాలక్ తివారీతో పాటు సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, దీపికా పదుకొనే, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, ఆలియా భట్, రణబీర్ కపూర్‌ సహా పలువురు ప్రముఖులు అనంత్ - రాధికల‌ సంగీత్ వేడుకకు హాజరయ్యారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ - నీతా అంబానీల‌ కుమారుడు అనంత్ అంబానీ ..అతడి కాబోయే భార్య రాధిక మర్చంట్ వివాహ వేడుకలు బుధవారం ముంబైలోని అంబానీ నివాసం అంటీలియాలో మామెరు వేడుకతో ప్రారంభమయ్యాయి. మోస్ట్ అవైటెడ్ గ్రాండ్ వెడ్డింగ్ వేడుక జూలై 13న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. అతిథులు 'సేవ్ ది డేట్' ఆహ్వానాన్ని ఇప్ప‌టికే అందుకున్నారు. ఇది సంప్రదాయ ఎరుపు- బంగారు వ‌ర్ణం కార్డు. మూడు రోజుల ఫంక్షన్ వివరాలు ఇందులో ఉన్నాయి.

అంగ‌రంగ వైభ‌వంగా సాగే ఈ వివాహ వేడుకలు జూలై 12న ప్రారంభమవుతాయి. మొదటి వేడుక శుభ వివాహం లేదా వివాహ కార్యక్రమం. డ్రెస్ కోడ్ భారతీయ సంప్రదాయంను అనుస‌రించి ఉంటుంది. జూలై 13 శుభ్ ఆశీర్వాద్ రోజు.. దుస్తుల కోడ్ భారతీయ ట్రెడిష‌న్ లో ఉంటుంది. జూలై 14 మంగళ్ ఉత్సవ్ లేదా వివాహ రిసెప్షన్ .. డ్రెస్ కోడ్ ఇండియన్ చిక్ స్టైల్. ఈ కార్యక్రమాలన్నీ BKCలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరుగుతాయి. త‌న అందంతో మ‌తి పోగొడుతున్న స్టార్ హీరో సైఫ్ ఖాన్ కొడుకు ఇబ్ర‌హీం అలీఖాన్ గాళ్ ఫ్రెండ్ పాల‌క్ తివారీ.. పెళ్లిలో షో స్టాప‌ర్ గా నిలుస్తోంది.