ఫోటో స్టోరి: కవ్వించే యవ్వనశిరి పాలక్
మిడ్డీల్లో ఫ్రాకుల్లో కవ్వించడం పాలక్ కి కొత్తేమీ కాదు కానీ, ఈసారి మోకాలు లోతు నీళ్లలోకి దిగి మరీ కవ్విస్తోంది.
By: Tupaki Desk | 7 July 2025 10:15 AM ISTమిడ్డీల్లో ఫ్రాకుల్లో కవ్వించడం పాలక్ కి కొత్తేమీ కాదు కానీ, ఈసారి మోకాలు లోతు నీళ్లలోకి దిగి మరీ కవ్విస్తోంది. అసలే ఎర్ర ఫ్రాకు.. ఆపై జిల్లనిపించే అందాల శిరి.. టోన్డ్ అందాలతో సోగ దేహంతో ఇలా కవ్విస్తుంటే, కుర్రకారు గుండె లయ తప్పి గిలగిలా కొట్టుకుంటోంది.
టీవీ మూవీ నటి శ్వేతా తివారీ నటవారసురాలిగా సినీప్రపంచానికి పరిచయమైనా కానీ, ఈ అమ్మడు తనదైన ప్రతిభ, అందచందాలతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. రెగ్యులర్ గా ఫోటోషూట్లను ఇన్ స్టాలో తన అభిమానులకు షేర్ చేస్తూ, స్పెషల్ ట్రీట్ ఇస్తోంది. పాలక్ బికినీ లుక్, మిడీ లుక్, శారీ లుక్ లేదా ఇంకేదైనా ట్రెడిషనల్ లెహంగాలో సంథింగ్ స్పెషల్ గా మెరిసిపోతోంది.
ఓవైపు సైఫ్ అలీఖాన్ నటవారసుడు ఇబ్రహీం అలీఖాన్ తో స్నేహం కారణంగా నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్న ఈ బ్యూటీ డేటింగ్ గురించి ఇప్పటికీ సీక్రెసీ మెయింటెయిన్ చేస్తోంది. పాలక్ ఇతర నటవారసుల్లానే మునుముందు దక్షిణాది చిత్రసీమలోకి అడుగుపెట్టనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సల్మాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ చిత్రంలో నటించిన పాలక్ ఆ తర్వాత వెబ్ సిరీస్ లలో నటించింది. రోమియో ఎస్3, రోసీ వంటి సిరీస్ లతో అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ లో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించేందుకు వేచి చూడాల్సి ఉంది.
