Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కుర్రాళ్ల గుండెల్లో గులాబీ ముల్లు

బుల్లితెర ఐకాన్ శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ బాలీవుడ్‌లో మెరుపులు మెరిపిస్తోంది.

By:  Tupaki Desk   |   7 April 2025 10:00 AM IST
ఫోటో స్టోరి: కుర్రాళ్ల గుండెల్లో గులాబీ ముల్లు
X

బుల్లితెర ఐకాన్ శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ బాలీవుడ్‌లో మెరుపులు మెరిపిస్తోంది. యువ‌న‌టి వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ తనదైన ఖ్యాతిని సంపాదించుకుంటోంది. త‌దుప‌రి హర్రర్ చిత్రం భూత్నీతో అభిమానుల ముందుకు వ‌స్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్న పాల‌క్ హా*, గ్లామరస్ లుక్‌లను అందిస్తోంది.


పాల‌క్ వ‌రుస ఫోటోషూట్ల‌పై యువ‌త‌రం నుంచి ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఈ బ్యూటీ తన తాజా ఇన్ స్టా పోస్ట్‌లో ఆకర్షణీయమైన ఎరుపు రంగు ఫ్రాక్ లో మ‌తులు చెడ‌గొట్టింది. ఈ లుక్ డేట్-నైట్ ఫ్యాషన్ కి ప్రేరణగా నిలుస్తుంద‌ని కాంప్లిమెంట్ అందుకుంటోంది. బ్రాండ్ క్లిప్సే కు చెందిన ఎరుపు మిడి డ్రెస్ ఖ‌రీదు రూ. 63,870. బాడీకాన్ ఎరుపు రంగు డ్రెస్ పాలక్ కి వంద శాతం యాప్ట్ అయింది. ఈ సొగసైన ఎరుపు రంగు డ్రెస్ కి రెండు గులాబీ అప్లిక్యూలను జ‌త చేయ‌డం ఆక‌ర్ష‌ణ‌ను పెంచింది. డేట్-నైట్ థీమ్‌కు ఇది యాప్ట్ డ్రెస్.


పాలక్ తివారీ తన అద్భుతమైన అందం, ప్రతిభ , అసమానమైన ఫ్యాషన్ సెన్స్‌తో షోబిజ్‌లో వేవ్స్ సృష్టిస్తోంది. ఈ భామ‌ బ్లాక్ స్లిట్ బాడీకాన్ డ్రెస్ లో లేదా జెన్ జెడ్ -కోర్ ఫిట్ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భూత్నీ చిత్రంలో సంజ‌య్ ద‌త్, మౌని రాయ్, సన్నీ సింగ్, బియోనిక్, ఆసిఫ్ ఖాన్ త‌దిత‌రులతో పాటు పాల‌క్ న‌టించారు. చిత్ర ప్రచార పర్యటనలో భాగంగా ఇటీవ‌ల‌ పూణే నగరాన్ని సందర్శించారు. అభిమానుల నుండి ఉత్సాహభరితమైన స్పందన లభించింది.


సిధాంత్ సచ్‌దేవ్ దర్శకత్వం వహించిన ది భూత్నీ ట్రైలర్ రొటీన్ గా ఉన్నా కానీ, హార‌ర్ సినిమాల‌కు ఆద‌ర‌ణ త‌గ్గ‌క‌పోవ‌డంతో కొంత ఉత్సాహం నెల‌కొంది. యాక్షన్, హర్రర్, కామెడీల మిక్స్ తో ఈ సినిమా తెర‌కెక్కింది. సంజయ్ దత్ ఘోస్ట్ బస్టర్ బాబా పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాత్ర ఇప్పటికే ప్రేక్షకులలో ఉత్సుకతను రేకెత్తించింది.