ఫోటో స్టోరి: చెమటలు పట్టిస్తున్న పాలక్
ప్రస్తుతం ఈ స్పెషల్ సెల్ఫీలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలకు ఫైర్, హార్ట్ ఈమోజీలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఫుల్ జోష్ చూపిస్తున్నారు.
By: Tupaki Desk | 6 Jun 2025 9:11 AM ISTసల్మాన్ భాయ్ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' చిత్రంతో తెరంగేట్రం చేసింది పాలక్ తివారీ. ఆ తర్వాత దాదాపు రెండేళ్లకు పాలక్ నటించిన హారర్-కామెడీ 'ది భూత్నీ'తో తిరిగి అభిమానుల ముందుకు వచ్చింది. తదుపరి స్టార్ కిడ్స్ సరసన నటించేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వరస చిత్రాలతో కెరీర్ పరంగా బిజీగా ఉంది.
ఇలాంటి సమయంలో పాలక్ రెండు విషయాల్లో ఎక్కువగా ఫోకస్ అవుతోంది. అది తన వృత్తిగత జీవితాన్ని మించి వ్యక్తిగత జీవితంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్ వారసుడు ఇబ్రహీం అలీఖాన్ తో పాలక్ తివారీ డేటింగ్ వార్తలు నిరంతరం మీడియాలో హైలైట్ అవుతున్నాయి. అదే సమయంలో పాలక్ వరస ఫోటోషూట్లు హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ కార్ లో సెల్ఫీలు దిగి ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ సెల్ఫీల్లో పాలక్ ఫుల్ గా స్వెటింగ్ తో కనిపించింది. ఓవైపు మేకప్ బ్యాలెన్స్ డ్ గా ఉన్నా వైట్ ఫ్రాక్‌లో పాలక్ మిల్కీ మిసమిసలు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ స్పెషల్ సెల్ఫీలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలకు ఫైర్, హార్ట్ ఈమోజీలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఫుల్ జోష్ చూపిస్తున్నారు.
నేను ఎక్కడున్నానో తెలీడం లేదు:
టీవీ నటి శ్వేతా తివారీ నటవారసురాలిగా బయటి ప్రపంచానికి తెలిసినా కానీ, తాను పూర్తిగా డైలమాలో ఉన్నానని పాలక్ చెబుతోంది. ''నేను నటవారసురాలిని అని అందరూ అంటున్నారు.. కానీ ఇక్కడ నా స్థానం ఏమిటో తెలుసుకోవడం కష్టంగా ఉంద''ని ఇటీవలి ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. తన ప్రయాణం మరే ఇతర స్టార్ కిడ్ ప్రయాణంలా లేదని చెబుతోంది పాలక్. టీవీ ఇండస్ట్రీ తన తల్లికి, తనకు, తన సోదరుడికి మంచి అవకాశాలిచ్చిందని పాలక్ చెబుతోంది.
