Begin typing your search above and press return to search.

వీళ్లిద్ద‌రిలో నాగార్జున ఎవ‌రో తెలుసా?

ఓ స‌మ‌యంలో ఎవ‌రో అత‌డు అచ్చం తెలుగు హీరో నాగార్జున లా ఉన్నాడ‌ని చెప్పారుట‌. దీంతో జైన్ నాగార్జున ఎవ‌రు? అని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసాడు.

By:  Tupaki Desk   |   12 March 2024 6:58 AM GMT
వీళ్లిద్ద‌రిలో నాగార్జున ఎవ‌రో తెలుసా?
X

ప్ర‌పంచంలో మ‌నుషుల్ని పోలిన మ‌నుషులు ఏడుగురుంటారు. అది నిజ‌మే అని కొన్నిసార్లు అనిపిస్తుం టుంది. ఎందుకంటే రాంగోపాల్ వ‌ర్మ బ‌యోపిక్ లు తీసే స‌మ‌యంలో అచ్చంగా అదే పోలిక‌లు ఉన్న వారిని వెతికి మ‌రి ప‌ట్టుకుంటాడు. ఇందులో వ‌ర్మ ని మించిన ఎక్స్ ప‌ర్ట్ ఎవ‌రూ ఉండ‌రు. మాజీ ముఖ్య మంత్రి చంద్ర‌బాబు నాయుడు పాత్ర కోసం మ‌హ‌రాష్ట్ర‌కు చెందిన ధ‌నుంజ‌య్ ప్ర‌భునే అనే వ్య‌క్తిని తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

అత‌డు అచ్చంగా చంద్ర‌బాబుకి అచ్చు గుద్దిన‌ట్లే ఉంటాడు. చంద్ర‌బాబు నాయుడు రెండ‌వ రూపం అత‌డే అనొచ్చు. వ‌ర్మ కార‌ణంగా ధ‌నుంజ‌య్ పెద్ద స్టార్ అయిపోయాడు. చంద్ర‌బాబు పాత్ర ఉన్నం కాలం అత‌డికి సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తూనే ఉంటాయి. ఇటీవ‌ల రిలీజ్ అయిన వ్యూహంలో కూడా న‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా నాగార్జున పొలిక‌ల‌తో ఉన్న పాకిస్తాన్ యూ ట్యూబ‌ర్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాడు.

అలా పోలిక‌లు ఉండ‌టంతో యూ ట్యూబ్ ద్వారా నెల‌కు ఐదారు ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు. వివ‌రాల్లోకి వెళ్తే. 2019 నుంచి టిక్ టాక్ వీడియోలు చేసుకుంటోన్న పాకిస్తాన్ లోని జైన్ అక్మ‌ల్ ఖాన్ అలియాస్ షికారీ మాస్ పుడ్ వ్లాగ‌ర్ గా పేరుతెచ్చుకున్నాడు. ఓ స‌మ‌యంలో ఎవ‌రో అత‌డు అచ్చం తెలుగు హీరో నాగార్జున లా ఉన్నాడ‌ని చెప్పారుట‌. దీంతో జైన్ నాగార్జున ఎవ‌రు? అని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసాడు.

అత‌డి హ‌వ‌భాలు అన్నీ చూసి అప్ప‌టి నుంచి నాగార్జున మ్యాక‌ప్ వేసుకుని వీడియోలు చేయ‌డం మొద‌లు పెట్టాడు. పుడ్ వీడియోలు నాగార్జున‌లా త‌యారై చేస్తుంటే బాగా వైర‌ల్ అవుతున్నాయ‌న్నాడు. దానికి ద్వారా నెల‌కు నాలుగైదు ల‌క్ష‌లు సంపాదిస్తున్న‌ట్లు తెలిపాడు. ఇంత‌లా వైర‌ల్ కావ‌డానికి కార‌ణంగా నాగార్జున అంటూ సంతోషం వ్య‌క్తం చేసాడు. ఇక ఏపీముఖ్య‌మంత్రి జ‌న‌గ్ మోహ‌న్ రెడ్డి పోలిక‌ల‌తో త‌మిళ న‌టుడు అజ్మ‌ల్ అమీర్ ఉంటాడ‌ని చాలా మంది భావిస్తారు. జ‌గ‌న్ పాత్ర‌లోనూ అజ్మ‌ల్ ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఇంకా వివిధ రీల్స్ లో చాలా మంది న‌టుల పోలిక‌ల‌తో ప‌లువురు యూ ట్యూబ‌ర్లు క‌నిపిస్తుంటారు.