Begin typing your search above and press return to search.

గెల‌వకుండానే గెలిచిన‌ట్లు పాకిస్తాన్ కామెడీ!

ప‌హాల్గాం ఘ‌ట‌నపై దాయాది పాకిస్తాన్ పై భార‌త్ ప్ర‌తీకార చ‌ర్య ఏ రేంజ్ లో జ‌రిగిందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Jun 2025 4:39 PM IST
గెల‌వకుండానే గెలిచిన‌ట్లు పాకిస్తాన్ కామెడీ!
X

ప‌హాల్గాం ఘ‌ట‌నపై దాయాది పాకిస్తాన్ పై భార‌త్ ప్ర‌తీకార చ‌ర్య ఏ రేంజ్ లో జ‌రిగిందో తెలిసిందే. ఆప‌రేష‌న్ సిదూర్ పేరిట‌ పాకిస్తాన్ ఉగ్ర‌వాదుల‌ను, ఎయిర్ బేస్ ల‌ను మ‌ట్టిలో క‌లిపేసి కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ దాడిలో కీల‌క ఉగ్ర నేత‌ల్ని మ‌ట్టుబెట్టింది భార‌త్. దేశంలో పాకిస్తాన్ వాసులు లేకుండా త‌రిమి కొట్టింది. ఈ యుద్ద ప్ర‌భావం భార‌త్ లో ప‌నిచేస్తోన్న పాకిస్తాన్ క‌ళాకారుల‌పైనా ప‌డింది. భార‌తీయ చిత్రాల్లో అవ‌కాశాలివ్వ‌కూడ‌దని భార‌త సంఘాలు నిషేధించాయి. ఇరు దేశాల మ‌ధ్య జ‌రిగిన ఎయిర్ స్ట్రైక్స్ లో భార‌త్ పై చేయి సాధించింది.

పాకిస్తాన్ పై భార‌త్ కు ఇలాంటి విజ‌యాలెన్నో. వాట‌న్నింటిని సినిమాగా తీస్తే పాకిస్తాన్ చూసి త‌ట్టుకోలేదు. అయితే పాకిస్తాన్ మాత్రం ఎయిర్ స్ట్రైక్స్ లో ప్ర‌త్య‌ర్ది దేశంపై తామే విజ‌యం సాధించిన‌ట్లుగా ఓ సినిమా తీసారు. ఆ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ ఒక‌టి నెట్టింట వైరల్ అవుతుంది. త‌మ శ‌త్రువుల‌పై జ‌రిగిన వైమానిక దాడిలో త‌మ‌దే విజ‌యం అన్న‌ట్లో ఫోక‌స్ చేసుకుంది. కానీ వాస్త‌వం ఏంటంటే? ఇంతవ‌ర‌కూ పాకిస్తాన్ భార‌త్ తో ఒక్క యుద్దం కూడా గెల‌వ‌లేదు.

ఆ ట్రైల‌ర్ లో మాత్రం పాకిస్తాన్ విజేత‌గా చూపించారు. మ‌రి ఇంత‌టి దుస్సాహ‌సం చేసిన ద‌ర్శ‌క‌, నిర్మాత లెవ‌రో? తెలుసు కోవాల్సిన ప‌నిలేదు. తాజాగా ఈ ట్రైల‌ర్ ట్రోలింగ్ కి గురైంది. ర‌క‌ర‌కాల కామెంట్ల‌తో కామెడీని చేసేసారు. 'ఇంకా డిస్క్లైమర్ హోతా హోగా- దీనికి వాస్తవికతతో సంబంధం లేదు' అని ట్వీట్ చేశారు. మరొకరు 'విఎఫ్ ఎక్స్ బడ్జెట్ భారతీయ వెబ్ సిరీస్ బడ్జెట్ కంటే తక్కువగా ఉంది.

ఫైటర్ జెట్‌లు 90ల నాటి వీడియో గేమ్ నుండి కాపీ-పేస్ట్ చేసినట్లుగా కనిపించాయి. హీరో డైలాగులు అప్ప‌గిస్తున్న‌ట్లు ఉంది. స్క్రిప్ట్ చదువుతున్న‌ట్లుగా ఉంది. ఐక్య‌త ప్రేరేపించేలా ఉండాల్సింది పోయి... హాస్యాన్ని అందిస్తారు ఏంటి? అంటూ హేళ‌న చేస్తున్నారు. నిజంగా దాయాది గ‌నుక ఈ కామెంట్లు చూస్తే అదేదో చేసుకోవడం ఖాయం.