Begin typing your search above and press return to search.

భారత్ వరుడు - పాక్ వధువు.. వివాహాన్ని ఆపిన ఉగ్రదాడి!

పహల్గాం ఉగ్రదాడి భారత్ లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి అనంతరం భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది

By:  Tupaki Desk   |   24 April 2025 5:21 PM IST
Indo-Pak Couple’s Wedding Postponed
X

పహల్గాం ఉగ్రదాడి భారత్ లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి అనంతరం భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా... అట్టారీ - వాఘా సరిహద్దును మూసివేయాలని నిర్ణయించింది. దీంతో... భారత్ - పాక్ మధ్య ప్రయాణాలు ముగిసిపోయాయి! దీంతో... ఓ వివాహం ఆగిపోయింది.

అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాల నేపథ్యంలో అట్టారీ - వాఘా సరిహద్దును మూసివేయాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో... వివిధ కారణాలతో పాక్ కు ప్రయాణించే భారతీయ పౌరులను కూడా ఈ నిర్ణయం ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఇందులో భాగంగా ఆగిన ఓ వివాహ విషయం తెరపైకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... రాజస్థాన్ కు చెందిన షైతాన్ సింగ్ త్వరలో పాకిస్థాన్ కు చెందిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ సమయంలో షైతాన్ సింగ్, అతని కుటుంబం, బంధువులు గురువారం అట్టారీ - వాఘా సరిహద్దుల ద్వారా పాకిస్థాన్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. దార్లు మూసేశారు.

దీంతో.. ప్రస్తుతానికి వారి వివాహం ఆగిపోయింది. రెండు దేశాల మధ్య పరిస్థితి మెరుగుపడే వరకూ వీరి వివాహం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా స్పందించిన షైతాన్ సింగ్... ఇది సరిహద్దు సమస్య అని.. భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనదే అని.. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి సరైన పని కాదని అన్నారు.