Begin typing your search above and press return to search.

బ్లాక్ డ్రెస్ లో పాయల్ పరువాల విందు..!

ఈ డ్రెస్ లో పాయల్ చాలా అందంగా ఉంది. ఆ డ్రెస్ కి కరెక్ట్ గా సెట్ అయ్యేలా ముస్తాబైంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   12 Sep 2023 2:29 PM GMT
బ్లాక్ డ్రెస్ లో పాయల్ పరువాల విందు..!
X

పాయల్ రాజ్ పూత్ కి పరిచయం అవసరం లేదు. ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఆమె టాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టింది. ఆ సినిమాలో పాయల్ క్యారెక్టర్, అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఆ సినిమాలో ఆమె కొంచెం నెగిటివ్ షేడ్స్ లో నటించింది. మొదటి సినిమాకే, అలాంటి రోల్ చేయడం సాహసమనే చెప్పాలి.


కాగా, పాయల్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా బోల్డ్ ఫోటో షూట్ చేయడంలో పాయల్ ఎప్పుడూ ముందుంటుంది. కానీ, తాజాగా మాత్రం బ్లాక్ కలర్ డ్రెస్ లో మోడ్రన్ టచ్ ఇచ్చింది. ఈ డ్రెస్ లో పాయల్ చాలా అందంగా ఉంది. ఆ డ్రెస్ కి కరెక్ట్ గా సెట్ అయ్యేలా ముస్తాబైంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

అయితే, ఈ మధ్య పాయల్ తెరపై కనిపించి చాలా రోజులు అవుతోంది. ఈ క్రమంలో 'మంగళవారం' అనే సినిమాతో మన ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ మూవీ ట్రైలర్ కూడా ఇటీవల విడుదల చేయగా, విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తో మళ్లీ హిట్ కొడతాననే నమ్మకంతో పాయల్ ఉంది.

ఆర్ఎక్స్100 తో హిట్ కొట్టిన అజయ్ భూపతి, ఆ తర్వాత మహా సముద్రం సినిమా తీశారు. సిద్ధార్ధ్, శర్వా లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో, ఈసారి అజయ్ రూట్ మార్చి, ఇంట్రస్టింగ్ కథతో మన ముందుకు రావడానికి రెడీ అయ్యారు. మరి ఈ మూవీతో పాయల్ మళ్లీ ఫామ్ లోకి వస్తుందో లేదో చూడాలి.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం పాయల్ చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు మాయా పేటిక అనే సినిమా చేస్తోంది. ఈ మూవీ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.