Begin typing your search above and press return to search.

79 ఏళ్ల న‌టుడు బ‌ల‌వంతం చేశాడు

అంటే ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ షో స్క్విడ్ గేమ్‌లో న‌టించిన అత‌డి పేరు యోంగ్ -షు. అత‌డిపై విచార‌ణలో లైంగిక వేధింపుల‌కు పాల్పడ్డాడ‌ని నిర్ధారించారు.

By:  Tupaki Desk   |   16 March 2024 5:52 AM GMT
79 ఏళ్ల న‌టుడు బ‌ల‌వంతం చేశాడు
X

అత‌డి వ‌య‌సు 79. బుద్ది వ‌క్రించి సెట్లో బ‌లాత్కారం చేసాడు. స‌హ‌న‌టిని బ‌ల‌వంతంగా ముద్దు పెట్టుకున్నాడు. గ‌ట్టిగా కౌగిలించుకుని లైంగికంగా వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. దీంతో ఇప్పుడు జైలు ఊచ‌ల్లెక్కిస్తున్నాడు. ఇంత‌కీ ఎవ‌రా న‌టుడు? అంటే ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ షో స్క్విడ్ గేమ్‌లో న‌టించిన అత‌డి పేరు యోంగ్ -షు. అత‌డిపై విచార‌ణలో లైంగిక వేధింపుల‌కు పాల్పడ్డాడ‌ని నిర్ధారించారు.

యోంగ్ కి దక్షిణ కొరియాలోని కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్షను ఖ‌రారు చేసి, రెండేళ్లపాటు వృత్తి నుంచి సస్పెండ్ చేసింది. యోంగ్ -షు 2017లో థియేటర్ సహోద్యోగినిపై బ‌లాత్కారానికి పాల్ప‌డ్డాడు. రెండు ర‌కాల‌ లైంగిక వేధింపుల అభియోగాలు న‌మోద‌య్యాయి. అయితే స‌హ‌న‌టి ఆరోపణలను ఆయన ఖండించారు.

సువాన్ జిల్లా కోర్టు అతన్ని లైంగిక హింస నుంచి ప‌రివ‌ర్త‌న‌ చికిత్స కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వుపై తాను అప్పీల్ చేస్తానని, అలా చేయడానికి తనకు ఏడు రోజుల సమయం ఉందని, లేదంటే తీర్పును సమర్థించుకుంటానని ఓ యోంగ్-షు చెప్పారు. స్క్విడ్ గేమ్ మొదటి సీజన్‌లో ఓ-యోంగ్-సు ఓహ్ II-నామ్ పాత్రను పోషించాడు.

గ‌త శుక్రవారం కోర్టు నుండి బయలుదేరిన తరువాత అతడు విలేకరులతో మాట్లాడుతూ, 40 గంటల లైంగిక నేరస్థుల చికిత్స కార్యక్రమానికి హాజరు కావడంతోపాటు తీర్పుపై అప్పీల్ చేస్తానని చెప్పారు. ఓ సరస్సు చుట్టూ మార్గనిర్దేశం చేసేందుకు మహిళ చేతిని పట్టుకున్నట్లు గతంలో అతడు చెప్పాడు. నేను క్షమాపణలు చెప్పాను ఎందుకంటే (వ్యక్తి) ఆమె దాని గురించి రచ్చ చేయదు గ‌నుక‌..అయితే నేను ఆరోపణలను అంగీకరించినట్లు కాదు! అని అతడు చెప్పాడు.

ఐదు దశాబ్దాలకు పైగా అత‌డు షోబిజ్ లో ఉన్నాడు కానీ నెట్‌ఫ్లిక్స్ 'స్క్విడ్ గేమ్' లో పాత్ర వ‌ల్ల‌నే ప్రపంచ ఖ్యాతిని ప్రశంసలను ద‌క్కించుకున్నాడు. ఈ సిరీస్ చీకటి ప్రపంచాన్ని తెర‌ప‌రిచింది.