ఓవర్ నైట్ స్టార్‌డం.. ఈమె కొత్త నేషనల్ క్రష్
ఒకప్పుడు సినిమాలు హిట్ అయితే హీరోయిన్స్‌కి సోషల్ మీడియాలో పాపులారిటీ దక్కేది.
By: Tupaki Desk | 20 July 2025 2:00 PM ISTఒకప్పుడు సినిమాలు హిట్ అయితే హీరోయిన్స్‌కి సోషల్ మీడియాలో పాపులారిటీ దక్కేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులారిటీ దక్కించుకున్న తర్వాత హీరోయిన్స్ అవుతున్నారు. సినిమాలు హిట్ అయ్యి ఓవర్ నైట్‌లో స్టార్స్ అయిన హీరోలు, హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఈమధ్య కనిపిస్తున్నారు. హీరోలు, హీరోయిన్స్ స్టార్‌డం దక్కించుకోవడంకు చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ తాజాగా అహన్ పాండే, అనీత్ పడా లు ఓవర్ నైట్‌లో స్టార్‌డం దక్కించుకున్నారు. వీరు నటించిన 'సయ్యారా' సినిమా గత శుక్రవారం విడుదల అయింది. ఒక్క శుక్రవారం వీరి జాతకాన్ని మార్చేసింది. మొన్న శుక్రవారం నుంచి వీరి గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.
చుంకీ పాండే ఫ్యామిలీ హీరో అయిన అహాన్ పాండే నటుడిగా భలే ఎంట్రీ దక్కించుకున్నాడు. ఇకపై అతడు బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ లవ్ ఫిల్మ్స్ యంగ్ హీరో కావడం ఖాయం. లవ్ సినిమాలు అంటే ఇక మీదట అహాన్ పాండే గుర్తుకు రావాల్సిందే. సినిమాలో అతడి లుక్‌తో పాటు, నటన కూడా బాగుంది. అందుకే అతడు ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఇక హీరోయిన్ అనీత్ పడా సైతం ఓవర్ నైట్ స్టార్ అయింది. ప్రస్తుతం హిందీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా అన్ని భాషల సినీ ప్రేక్షకులు, ఫిల్మ్ మేకర్స్ అనీత్ గురించి మాట్లాడుకుంటున్నారు. దాంతో ఈమె ఓవర్ నైట్‌లో స్టార్‌డం దక్కించుకోవడం మాత్రమే కాకుండా కొత్త నేషనల్ క్రష్‌గానూ మారింది.
22 ఏళ్ల అనీత్ పడ్డా ఇండస్ట్రీలో సయ్యారా సినిమాతో అడుగు పెట్టిందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ సయ్యారా కంటే ముందు అనీత్ పడ్డా సలాం వెంకీ సినిమాలో నటించింది. ఆ సినిమాలో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అంతే కాకుండా బిగ్ గర్ల్స్ డోంట్ క్రై అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అది కూడా అనీత్ కి నటిగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. దాంతో ఆఫర్లు పెద్దగా రాలేదు. లక్కీగా వచ్చిన సయ్యారా సినిమాలో ఆమె తనను తాను నిరూపించుకుంది. వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకున్న అనీత్ పడ్డా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకున్నట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సయ్యారా సినిమా ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వసూళ్లను రాబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సయ్యారా విడుదలకు ముందు నుంచే పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది. ఈమధ్య కాలంలో ఏ కొత్త హీరో హీరోయిన్ సినిమాలు దక్కించుకోని భారీ ఓపెనింగ్స్‌ను దక్కించుకుంది. అంతే కాకుండా విడుదల తర్వాత వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్‌తో మొదటి రోజు ఏకంగా 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే సినిమా రూ.50 కోట్ల వసూళ్లు పూర్తి చేసింది. వీకెండ్ పూర్తి అయ్యేప్పటికి ఈ వసూళ్ల నెంబర్ ఎంత వరకు చేరుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ నేపథ్యంలో మొదటి వారం రోజుల్లో దాదాపుగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. దాంతో అనీత్ పడ్డా బాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల సినిమాల్లోనూ వరుస ఆఫర్లను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి అనీత్ పడ్డా ఈ క్రేజ్‌ను, స్టార్‌డంను ఎలా కాపాడుకుంటూ సినిమాలు చేస్తుందో చూడాలి.
