Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీ జాతర.. రాబోయే సినిమాలు వెబ్ సీరీస్ లు ఇవే!

అలాగే ఈ వారం మార్చి 11 నుంచి 17 వరకు ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు, సిరీస్ లు ఏంటనేది ఒకసారి చూద్దాం.

By:  Tupaki Desk   |   12 March 2024 4:00 AM GMT
ఈ వారం ఓటీటీ జాతర.. రాబోయే సినిమాలు వెబ్ సీరీస్ లు ఇవే!
X

డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ ఛానల్స్ కొత్త కొత్త వెబ్ సిరీస్ లు, సినిమాలని ప్రేక్షకులకి అందిస్తూ కావాల్సినంత వినోదాన్ని ఇస్తున్నాయి. ఇంట్లో ఉంటూనే అన్ని భాషలకి సంబందించిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు ఆన్ లైన్ లో చూడగలుగుతున్నాం. అలాగే ఈ వారం మార్చి 11 నుంచి 17 వరకు ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు, సిరీస్ లు ఏంటనేది ఒకసారి చూద్దాం.

నెట్ ఫ్లిక్స్ మార్చి 12న జీసస్ రివల్యూషన్ అనే ఇంగ్లీష్ మూవీ రిలీజ్ అవుతోంది. అలాగే టర్నింగ్ పాయింట్ అనే మూవీ కూడా రాబోతోంది. మార్చి 14న 24 హావర్స్ విత్ గాస్పర్ అనే హాలీవుడ్ లో మూవీ వస్తోంది. అదే రోజు ఇంగ్లీష్ వెబ్ సిరీస్ గర్ల్స్ 5ఎవా సీజన్ 3 స్ట్రీమింగ్ కాబోతోంది. మార్చి 15న ఐరిష్ విష్ అనే ఇంగ్లీష్ మూవీ లైవ్ లోకి వస్తోంది. మార్చి 15న నెట్ ఫ్లిక్స్ లో మర్డర్ ముబారక్ రిలీజ్ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్ లో మార్చి 13న హిందీ వెబ్ సిరీస్ లవ్ అదురా రిలీజ్ కాబోతోంది. మార్చి 14న హిందీ వెబ్ సిరీస్ బిగ్ గర్ల్స్ డోంట్ క్రై టెలికాస్ట్ అవ్వనుంది. అదే రోజు ఇన్విన్సజిబుల్ సీజన్ 2 పార్ట్ 2 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మార్చి 15న హాలీవుడ్ మూవీ ఫ్రిడా రిలీజ్ అవుతోంది. హాట్ స్టార్ లో ఇంగ్లీష్ వెబ్ సిరీస్ గ్రేస్ అనాటమీ : సీజన్ 20 మొదలుకాబోతోంది.

మార్చి 15న తెలుగు వెబ్ సిరీస్ సేవ్ ది టైగెర్స్ సీజన్ 2 అందుబాటులోకి రాబోతోంది. జియో సినిమాలో హనుమాన్ హిందీ వెర్షన్ మార్చి 16న రిలీజ్ కాబోతోంది. మార్చి 17న ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. సోనీ లివ్ లో మమ్ముట్టి భ్రమయుగం మూవీ మార్చి 15న రిలీజ్ కాబోతోంది. జీ5లో మార్చి 14న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయ్ బయోపిక్ మెయిన్ అటల్ హు మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

నెట్ ఫ్లిక్స్

1) మార్చి 11- యంగ్ రాయల్స్ సీజన్ 3 (స్వీడిష్ సిరీస్)

2) మార్చి 12 – జీసస్ రివల్యూషన్ (ఇంగ్లీష్ మూవీ)

3) మార్చి 12 – టర్నింగ్ పాయింట్ (ఇంగ్లీష్ సిరీస్)

4) మార్చి 13 – బండిడోష్ (స్పానిష్ సిరీస్)

5) మార్చి 14 – 24 హావర్స్ విత్ గాస్పర్ (ఇంగ్లీష్ మూవీ)

6) మార్చి 14 – గర్ల్స్ 5ఎవా -సీజన్3 (ఇంగ్లీష్ సిరీస్)

7) మార్చి 15 – చికెన్ నగ్గెట్ (కొరియన్ సిరీస్)

8) మార్చి 15 – ఐరిష్ విష్ ( ఇంగ్లీష్ మూవీ)

9) మార్చి 15 – ఐరన్ రియన్ ( స్పానిష్ సిరీస్)

10) మార్చి 15 – మర్డర్ ముబారక్ (హిందీ సినిమా)

అమెజాన్ ప్రైమ్:

1) మార్చి 13 – లవ్ అదురా (హిందీ సిరీస్)

2) మార్చి 14 – బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ సిరీస్)

3) మార్చి 14 – ఇన్విన్సజిబుల్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్)

4) మార్చి 15 – ఫ్రిడా ( ఇంగ్లీష్ మూవీ)

హాట్ స్టార్:

1) మార్చి 15 – గ్రేస్ అనాటమీ : సీజన్ 20( ఇంగ్లీష్ సిరీస్)

2) మార్చి 15 – సేవ్ ది టైగెర్స్ సీజన్ 2 ( తెలుగు సిరీస్)

3) మార్చి 15 – టేలర్ స్విఫ్ట్: ది ఏరాస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ)

జియో సినిమా:

1) మార్చి 16 – హనుమాన్ (హిందీ వెర్షన్)

2) మార్చి 17 – ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లీష్ మూవీ)

సోనిలివ్ :

1) మార్చి 15 – భ్రమ యుగం

జీ 5:

1) మార్చి 14 – మెయిన్ అటల్ హు (హిందీ మూవీ)