Begin typing your search above and press return to search.

బడా హీరోలకు ఓటీటీ దెబ్బలు

బాక్సాఫీస్ వద్ద సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కొందరు హీరోలు తమ రెమ్యునరేషన్ ను పెంచుతున్నారు. ఒక్క సినిమాలో నటించాక.. మరో మూవీకి సైన్ చేసే ముందు మరింత పెంచేస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 Dec 2023 5:08 AM GMT
బడా హీరోలకు ఓటీటీ దెబ్బలు
X

బాక్సాఫీస్ వద్ద సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కొందరు హీరోలు తమ రెమ్యునరేషన్ ను పెంచుతున్నారు. ఒక్క సినిమాలో నటించాక.. మరో మూవీకి సైన్ చేసే ముందు మరింత పెంచేస్తున్నారు. ఓటీటీ మ్యానియా మొదలైనప్పటి నుంచి ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్ హీరోలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారట. వారు నటించబోయే చిత్రాలకు ఏ ఒక్క ఓటీటీ ప్లాట్ ఫామ్ పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లించడానికి ఆసక్తి చూపించట్లేదట. ఆ హీరోల ముందు సినిమాలు హిట్ కాకపోవడం వల్ల వాళ్లు అలా చేస్తున్నారట. అయితే ఆ హీరోలు డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ ఇవ్వలేక నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు తెరకెక్కించాలో లేదా అన్న ఆలోచనలో పడ్డారట. ఇప్పుడు చాలా మంది హీరోలకు ఇదే సమస్య ఎదురువుతోందట.

అందుకు సంబంధించిన వార్తలు.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నారు. ఇటీవలే తనకు హిట్ ఇచ్చిన దర్శకుడిలో సినిమా చేయడానికి ఓ సీనియర్ హీరో ఒప్పుకున్నారట. గ్రాండ్ గా లాంఛ్ కూడా చేశారట. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా రద్దు అయ్యే అవకాశముందట. ఎందుకంటే ఆ సినిమాకు హీరో భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారట. మొత్తం సినిమాను రూ.90 కోట్ల బడ్జెట్ తో నిర్మించాలని మేకర్స్ భావించారట. కానీ ఆ సీనియర్ హీరో మాత్రం రూ.130 కోట్లు డిమాండ్ చేశారట. దీంతో ఆ మూవీ రద్దైందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఆ సినిమా తర్వాత మరో ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ తో ఆ హీరో ఓ రీమేక్ చిత్రం చేయాల్సి ఉంది. ఆ మూవీ కూడా బడ్జెట్‍ వల్ల సినిమా ఆలస్యమవ్వనుందని వార్తలు వస్తున్నాయి. ఓటీటీ ఫాట్ పామ్ లు రీమేక్ మూవీ కనుక తక్కువ మొత్తం చెల్లిస్తామని చెబుతున్నాయట. దీంతో నిర్మాతలు సినిమా ఖర్చులు తగ్గించుకునేందుకు హీరో రెమ్యునరేషన్ తగ్గించమంటున్నారట. అందుకు హీరో ఒప్పుకోవడం లేదట. దీంతో ఆ నిర్మాత కూడా సినిమా విషయంలో డైలమాలో పడ్డారట.

ప్రముఖ ఓటీటీతో సంబంధాలు ఉన్న మరో నిర్మాణ సంస్థ కూడా ఈ హీరోతో చిత్రం రద్దు చేసుకునేందుకు నిర్ణయించుకుందట. ఆ తర్వాత బడ్జెట్ లో కోతలు విధించి ప్రారంభించేందుకు సిద్ధమయిందట. దీంతో ఆ హీరో ఒక్కసారిగా షాక్ అయ్యారట. తాను ప్రస్తుతం త్వరలో రిలీజ్ కానున్న సినిమాకు ప్రమోషన్లు చేసుకుంటానని చెప్పారట. తర్వాత ఈ సినిమాల విషయాల్లో ఆలోచిస్తానని చెప్పారట. అయితే ఒక్క ఆ సీనియర్ హీరో విషయంలోనే కాకుండా మిగతా సినిమా నిర్మాతలు కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది.