Begin typing your search above and press return to search.

ఈ వారం.. ఓటీటీ, థియేటర్స్ లో సందడి చేసే సినిమాలివే..

ప్రతివారం ఆడియన్స్ కి వినోదాన్ని అందించడం కోసం నిర్మాణ సంస్థలు, డిజిటల్ ఛానల్స్ సినిమాలు, వెబ్ సిరీస్ లని రిలీజ్ చేస్తూ ఉంటాయి

By:  Tupaki Desk   |   19 March 2024 3:54 AM GMT
ఈ వారం.. ఓటీటీ, థియేటర్స్ లో సందడి చేసే సినిమాలివే..
X

ప్రతివారం ఆడియన్స్ కి వినోదాన్ని అందించడం కోసం నిర్మాణ సంస్థలు, డిజిటల్ ఛానల్స్ సినిమాలు, వెబ్ సిరీస్ లని రిలీజ్ చేస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటాయి. మరికొన్ని డిజప్పాయింట్ చేస్తాయి. థియేటర్స్ లో కూడా కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తాయి.

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కాబోయే సినిమాల సంగతి చూసుకుంటే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్ లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్ మార్చి 22న విడుదల థియేటర్స్ లోకి వస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ కి పాజిటివ్ టాక్ వచ్చింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామిక్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ సిద్ధం అయ్యింది.

అనన్యా అనే థ్రిల్లర్ మూవీ కూడా మార్చి 22న రిలీజ్ కాబోతోంది. ఆశీష్ గాంధీ లీడ్ రోల్ లో నటించిన హద్దులేదురా మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకి వస్తోంది. వీటిలో ఏ చిత్రం ఆడియన్స్ ని కనెక్ట్ అవుతుందనేది వేచి చూడాలి.

ఇక ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే సినిమాల సంగతి చూసుకుంటే ఆహాలో శివ కందుకూరి నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ భూతద్దం భాస్కర్ నారాయణ మార్చి 20 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓజ్లర్ మార్చి 20 నుండి అందుబాటులో ఉండనుంది. హిందీ మూవీ లూటేరా మార్చి 22 రిలీజ్ కాబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో 3 బాడీ ప్రాబ్లమ్ వెబ్ సిరీస్ మార్చి 21 నుండి లైవ్ లోకి రాబోతోంది. హృతిక్ రోషన్ నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ఫైటర్ మార్చి 21న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటించిన లాల్ సలామ్ తమిళ, తెలుగు వెర్షన్స్ మార్చి 22 నుండి అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ ప్రైమ్ హిందీ వెబ్ సిరీస్ ప్లే గ్రౌండ్ మార్చి 17 నుండి అందుబాటులోకి వచ్చింది. తమిళ్ మూవీ మరక్కుమ నెంజాం మార్చి 19 నుండి స్ట్రీమింగ్ కానుంది. హిందీ మూవీ ఏ వతన్ మేరే వతన్ మార్చి 21 నుండి ప్రసారం అవ్వనుంది. హాలీవుడ్ మూవీ రోడ్ హౌస్ మార్చి 21 విడుదల అవుతోంది. బుక్ మై షోలో హాలీవుడ్ మూవీ ఫ్రాయిడ్స్ లాస్ట్ సెషన్ మార్చి 19 నుండి స్ట్రీమింగ్ లోకి వస్తోంది. జియో సినిమాలో ఆస్కార్ అవార్డు విన్నింగ్ మూవీ ఓపెన్ హైమర్ మార్చి 21 నుండి అందుబాటులోకి రాబోతోంది. ఈటీవీ విన్ హర్ష లీడ్ రోల్ చేసిన సుందరం మాస్టర్ మార్చి 22 నుండి లైవ్ లోకి వస్తోంది.

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు :

ఆహా :

4) భూతద్దం భాస్కర్ నారాయణ : మార్చి 20 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

5) ఓజ్లర్ : మార్చి 20 నుండి స్ట్రీమింగ్

6) లూటేరా (హిందీ) : మార్చి 22 నుండి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :

7) 3 బాడీ ప్రాబ్లమ్ (వెబ్ సిరీస్) : మార్చి 21 నుండి స్ట్రీమింగ్

8) ఫైటర్ (హిందీ) : మార్చి 21 నుండి స్ట్రీమింగ్

9) లాల్ సలామ్ : మార్చి 22 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్

10) ప్లే గ్రౌండ్ (హిందీ సిరీస్) : మార్చి 17 నుండి స్ట్రీమింగ్

11) మరక్కుమ నెంజాం (తమిళ) : మార్చి 19 నుండి స్ట్రీమింగ్

12) ఏ వతన్ మేరే వతన్ (హిందీ) : మార్చి 21 నుండి స్ట్రీమింగ్

13) రోడ్ హౌస్ (హాలీవుడ్) : మార్చి 21 నుండి స్ట్రీమింగ్

బుక్ మై షో

14) ఫ్రాయిడ్స్ లాస్ట్ సెషన్ (హాలీవుడ్): మార్చి 19 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా

15) ఓపెన్ హైమర్ (హాలీవుడ్) : మార్చి 21 నుండి స్ట్రీమింగ్

ఈటీవీ విన్

16) సుందరం మాస్టర్: మార్చి 22 నుండి స్ట్రీమింగ్