Begin typing your search above and press return to search.

ఈ వారం థియేటర్‌, ఓటీటీ వినోదాల విందు

ఈ రెండు సినిమాలతో పాటు ఓటీటీ ద్వారా పదుల కొద్ది తెలుగు ఇతర సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి

By:  Tupaki Desk   |   4 Sep 2023 7:39 AM GMT
ఈ వారం థియేటర్‌, ఓటీటీ వినోదాల విందు
X

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా ప్రేక్షకుల ముందుకు వినోదాల విందు రాబోతుంది. ఈ వారం తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న 'మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమా రాబోతుంది. అనుష్క హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమా లో జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి హీరో గా కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఈ వారం లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం ఖాయం అంటూ మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.

ఈ వారం రాబోతున్న మరో మూవీ 'జవాన్‌'. బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్ ఖాన్‌ నటించిన పఠాన్ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసిన నేపథ్యంలో ఈ సినిమా పై ఆసక్తి భారీగా ఉంది. ఈ సినిమా కు సౌత్ దర్శకుడు దర్శకత్వం వహించడం తో పాటు నయనతార నటించడం వల్ల తెలుగు మరియు తమిళ ప్రేక్షకులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ రెండు సినిమాలతో పాటు ఓటీటీ ద్వారా పదుల కొద్ది తెలుగు ఇతర సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రముఖ ఓటీటీ ల్లో ఈవారం స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న సినిమాలు మరియు సిరీస్ లు కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచబోతున్నాయి.

ఈ వారం ప్రధానంగా రజినీకాంత్‌ నటించిన జైలర్ సినిమా ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కు రెడీగా ఉంది. హడ్డీ అనే సినిమా కూడా ఈ వారంలోనే ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కు రెడీ అయింది. సెప్టెంబర్‌ 7వ తారీకున స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే జీ5 అధికారికంగా ప్రకటన చేసింది.

నెట్‌ ఫ్లిక్స్ లో షేన్‌ గిల్లీస్‌, స్కాట్స్‌ హానర్‌ సినిమాలు స్ట్రీమింగ్‌ అవ్వబోతున్నాయి. కుంగ్‌ ఫూ పాండా, టాప్ బాయ్‌, సెల్లింగ్ ది ఓసీ, వర్జిన్ రివర్‌ సిరీస్ లు కూడా ఈ సీజన్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక అమెజాన్ తో పాటు ఇతర ఓటీటీ ల్లో కూడా ప్రేక్షకులకు వినోదాల విందు ను అందించేందుకు గాను రెడీ అవుతున్నారు.