Begin typing your search above and press return to search.

ఓటీటీ - థియేటర్ స్టఫ్.. ఈ వారం లైట్ గానే..

కొత్త కొత్త సినిమాలు, డిఫరెంట్ కంటెంట్ లతో వెబ్ సిరీస్ లు ఆడియన్స్ కి వినోదం అందించడంతో పాటు థ్రిల్ చేస్తూ ఉన్నాయి.

By:  Tupaki Desk   |   18 Jan 2024 5:26 AM GMT
ఓటీటీ - థియేటర్ స్టఫ్.. ఈ వారం లైట్ గానే..
X

ప్రతి వారం కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకి థియేటర్స్ నుంచి అలాగే డిజిటల్ మాధ్యమాల నుంచి అందుతోంది. కొత్త కొత్త సినిమాలు, డిఫరెంట్ కంటెంట్ లతో వెబ్ సిరీస్ లు ఆడియన్స్ కి వినోదం అందించడంతో పాటు థ్రిల్ చేస్తూ ఉన్నాయి. ఈ కారణంగా డిజిటల్ ఓటీటీ ఛానల్స్ కి ఈ మధ్యకాలంలో విశేషమైన ఆదరణ పెరిగింది.

ఇక ఈ వారం థియేటర్స్ లో దశమ అనే మూవీ మూవీ జనవరి 18న రిలీజ్ అవుతోంది. జనవరి 19న వివేకానందన్ విరలాను అనే మలయాళం సినిమా, తెలుగు నుంచి కొత్త రంగుల ప్రపంచం అనే మూవీ జనవరి 20న విడుదల అవుతోంది. అయితే సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలకి ఆదరణ వస్తూ ఉండటంతో టాలీవుడ్ నుంచి పెద్ద హీరోలు ఎవరూ ఈ వారం వచ్చే ధైర్యం చేయడం లేదు.

ఇక ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ ల సంగతి చూసుకుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ‍్యాన్ జనవరి 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. హాలీవుడ్ సిరీస్ స్నేక్స్ SOS: గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4 జనవరి 20 నుంచి అందుబాటులోకి రానుంది. తమిళ్ మూవీ జో జనవరి 15న రిలీజ్ అయ్యింది. ల్యూక్ గుయాన్స్ ఇండియా హాలీవుడ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ లో ఉంది.

హాలీవుడ్ సిరీస్ డెత్ అండ్ అదర్ డీటైల్స్ జనవరి 16 రిలీజ్ అయ్యింది. బ్రాన్: ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ సిరీస్ జనవరి 19 నుంచి టెలికాస్ట్ కానుంది. అదే రోజు మరో హాలీవుడ్ సిరీస్ కులీన్ రూనీ: ద రియల్ వగ్తా స్టోరీ ప్రసారంలోకి వస్తుంది. నెట్‌ఫ్లిక్స్ హాలీవుడ్ మూవీ డస్టి స్లే: వర్కిన్ మ్యాన్ జనవరి 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

అమెరికన్ నైట్‌మేర్ హాలీవుడ్ సిరీస్ జనవరి 17 రిలీజ్ అయ్యింది. హాలీవుడ్ మూవీ మేరీ మెన్ 3 జనవరి 18న, మరో హాలీవుడ్ మూవీ ఫుల్ సర్కిల్ జనవరి 19న అందుబాటులోకి వస్తున్నాయి. హాలీవుడ్ వెబ్ సిరీస్ లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ యూ.ఎస్: సీజన్ 2 జనవరి 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ అనే హాలీవుడ్ మూవీ కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. ద కిచెన్ మూవీ కూడా రిలీజ్ అవ్వబోతోంది. అమెజాన్ ప్రైమ్ లో మలయాళీ మూవీ ఫిలిప్స్ హాలీవుడ్ సిరీస్ హజ్బిన్ హోటల్, హిందీ సిరీస్ - ఇండియన్ పోలీస్ ఫోర్స్, హాలీవుడ్ సిరీస్ లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ జనవరి 19 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.