Begin typing your search above and press return to search.

సంక్రాంతి సీజ‌న్ ని ఓటీటీలు కూడా ఊపేస్తున్నాయ్!

సంక్రాంతి సీజ‌న్ ని ఓటీటీలు కూడా ఎన్ క్యాష్ చేసుకోవ‌డానికి రెడీ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   15 Jan 2024 11:45 AM GMT
సంక్రాంతి సీజ‌న్ ని ఓటీటీలు కూడా ఊపేస్తున్నాయ్!
X

సంక్రాంతి సీజ‌న్ ని ఓటీటీలు కూడా ఎన్ క్యాష్ చేసుకోవ‌డానికి రెడీ అవుతున్నాయి. సెల‌వుల‌కు పిల్ల‌లు ..పెద్ద‌లు అంతా వారం ..ప‌ది రోజుల పాటు ఇళ్ల‌లోనే ఉంటారు కాబ‌ట్టి ఈ సీజ‌న్ ఓటీటీలు కూడా మిస్ చేసుకోవ‌డం లేదు. అన్ని ఓటీటీ సంస్థ‌లు కొత్త చిత్రాల్ని స్ట్రీమింగ్ చేయ‌డానికి రెడీ అవుతున్నాయి. దీనిలో భాగంగా వారం రోజుల్లోనే ఏకంగా 45 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మ‌రి ఏ సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందో చూస్తే స‌రి.

హాట్ స్టార్ లో త‌మిళ సినిమా `జో`.. ఇంగ్లీష్ సిరీస్ `ల్యూక్ గ‌యాన్స్ ఇండియా` జ‌న‌వ‌రి 15న‌..`డెత్ అండ్ అద‌ర్ డిటైల్స్` జ‌న‌వ‌రి 16న‌.. `ఏ షాప్ ప‌ర్ కిల్ల‌ర్స్` కొరియ‌న్ సిరీస్.. `ఇట్ వ‌జ్ ఆల్వేస్ మీ` స్పానిష్ సిరీస్ జ‌న‌వ‌రి 17... `ది ఇంపాజ్ బుల్ పార్ములా వ‌న్ స్టోరీ`.. `ది రియ‌ల్ వ‌గ్తా స్టోరీ`..`క్రిస్టోబ‌ల్ బ‌ల‌న్సియా` స్పానిస్ సిరీస్ జ‌న‌వ‌రి 19న రిలీజ్ అవుతున్నాయి. ఇదే రోజున నితిన్ `ఎక్ ట్రా ఆర్డీన‌రి మ్యాన్` కూడా హాట్ స్టార్ లోకి వ‌స్తుంది. అలాగే `గోవాస్ వైల్డీస్` సీజ‌న్ -4 జ‌న‌వ‌రి 20న రిలీజ్ అవుతుంది.

ఇక అమెజాన్ ప్రైమ్ లో `నో యాక్టివిటీ ఇటిలియ‌న్` సిరీస్ జ‌న‌వ‌రి 18న‌..` ఫిలిప్స్` (మ‌ల‌యాళం సినిమా)..`హ‌జ్బిన్ హోట‌ల్` ఇంగ్లీష్ సిరీస్.. `ఇండియ‌న్ పోలీస్ ఫోర్స్` హిందీ సిరీస్ ..`లాస్ట్ వ‌న్ లాఫింగ్ ఐర్లాండ్` ఇంగ్లీస్ సిరీస్ ..`జోర్రో` స్పానిష్ సిరీస్ లు జ‌న‌వ‌రి 19న అమెజాన్ లో రిలీజ్ అవుతున్నాయి. ఇక నెట్ ప్లిక్స్ లో జ‌న‌వ‌రి 15న `మ‌బోర్షి`..`రైజింగ్ ఇంపాక్ట్` జ‌ప‌నీస్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. `వ‌ర్కిన్ మ్యాన్` జ‌న‌వ‌రి16న రిలీజ్ అవుతుండ‌గా .. `అమెరిక‌న్ నైట్ మేర్`..`ఎండ్ ఆఫ్ ది లైన్` జ‌న‌వ‌రి 17న‌..` ప్ర‌మ్ ది యాసిస్` అర‌బిక్ చిత్రం..`కుబ్రా` ట‌ర్కీష్ సిరీస్..`మేరి మెన్ -3`.. `ప్రిమ్బాన్` ఇండోనేషియా మూవీ ..ర‌చిద్ బ‌దౌరీ జ‌న‌వ‌రి 18న రిలీజ్ అవుతున్నాయి.

ఇక జ‌న‌వ‌రి 19న `పుల్ స‌ర్కిల్` ..`ల‌వ్ అన్ ది స్పెక్ట్ర‌మ్` సీజ‌న్-2.. `మీసోల్` డాడ్ టియ‌న్ అలాస్`..`సిక్స్ టీ మినిట్స్`..`ది బెక్ తెడ్`.. `ది గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్`..`ది కిచెన్` లాంటి సిరీస్ లు..చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. `కేప్టివేటింగ్ ది కింగ్` కొరియ‌న్ సిరీస్ ఇదే నెల 20న రిలీజ్ అవుతుంది. ఇక జియో లో `ది నెక్స్ట్ చాప్ట‌ర్` సిరీస్.. `నైట్ కంట్రీ` సీజ‌న్ -4 జ‌న‌వ‌రి 15న రిలీజ్ అవుతున్నాయి. `బ్లూ బీట‌ల్`..`చికాగో ఫైర్` సిరీస్ లు జ‌న‌వ‌రి 18న ఓటీటీలోకి వ‌స్తున్నాయి. `లా అండ్ ఆర్డ‌ర్: స్పెష‌ల్ విక్టిమ్స్ యూనిట్` సీజ‌న్ 25 జ‌న‌వ‌రి 19న జియోలో రిలీజ్ అవుతుంది.

అలాగే బుక్ మైషోలో ప్రెంచ్ సినిమా `అసైడ్ జ‌న‌వ‌రి 15న‌..త‌మిళ‌ చిత్రం `ఒడ‌వుమ్డి ముడియాదు ఒలియ‌వుమ్ ముడియాదు` జ‌న‌వ‌రి 19న‌.. `ఆల్ ఫ‌న్ అండ్ గేమ్స్ `జ‌న‌వ‌రి 20న రిలీజ్ అవుతున్నాయి. ఇక సోనీ లివ్ లో `దేర్ ద క్రా డాడ్స్ సింగ్` అనే ఇంగ్లీష్ చిత్రం జ‌న‌వ‌రి 16న రిలీజ్ అవుతుంది. `ది మార్వెల్` ఇంగ్లిష్ సినిమా యూట్యూబ్ లో జ‌న‌వ‌రి 17న రిలీజ్ అవుతుంది. ఇక ముబిలో `పాలెన్ లీవ్స్` జ‌న‌వ‌రి 19న అందుబాటులోకి వ‌స్తుంది.