Begin typing your search above and press return to search.

ఈవారం ఓటీటీ సినిమాలు ఇవే

నా సామి రంగ మరియు ది కేరళ స్టోరీ సినిమాలతో పాటు కొన్ని వెబ్‌ సిరీస్ లు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

By:  Tupaki Desk   |   12 Feb 2024 7:51 AM GMT
ఈవారం ఓటీటీ సినిమాలు ఇవే
X

ఒక వైపు వారం వారం థియేటర్ల ద్వారా పెద్ద సినిమాలు మరియు మీడియం రేంజ్‌ క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి. మరో వైపు ఓటీటీ ద్వారా క్రేజీ సినిమాలు మరియు సిరీస్ లు షో లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వినోదాల విందు అందించే ఓటీటీ ఈ వారం ఎలాంటి సినిమాలతో రాబోతున్నాయో తెలుసుకుందాం.

తెలుగు ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న నా సామి రంగ మరియు ది కేరళ స్టోరీ సినిమాలతో పాటు కొన్ని వెబ్‌ సిరీస్ లు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఓటీటీ లో ఈ వారం కూడా పలు సినిమాలు సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి.

నా సామి రంగ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 17న స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. జీ5 లో గత ఏడాది విడుదల అయ్యి విజయం సాధించిన కేరళ స్టోరీ అన్ని భాషల్లో ఫిబ్రవరి 16న స్ట్రీమింగ్ కానుంది. సలార్‌ హిందీ వర్షన్ ను డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో ఫిబ్రవరి 16న స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

ఇంకా నెట్‌ ఫ్లిక్స్ లో సండర్‌లెండ్‌ టిల్‌ ఐ డీ, లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ వెబ్‌ సిరీస్ లు ఈ వారంలో రాబోతున్నాయి. ప్లేయర్స్‌, ఐన్‌స్టీన్‌ అండ్ ది బాంబ్‌ హాలీవుడ్ సినిమాలు ఈ వారం నెట్‌ ఫ్లిక్స్ లో ప్రధాన ఆకర్షణ మూవీస్ గా ఉండనున్నాయి.

అమెజాన్ ప్రైమ్‌ విషయానికి వస్తే ఫైవ్‌ బ్లైండ్‌ డేట్స్‌ వెబ్‌ సిరీస్‌ తో పాటు దిస్‌ ఈజ్ మీ నౌ అనే హాలీవుడ్ మూవీ కూడా స్ట్రీమింగ్‌ కానుకంది.

క్వీన్‌ ఎలిజబెత్‌ సినిమాను ది కేరళ స్టోరీ సినిమాతో పాటు జీ5 స్ట్రీమింగ్‌ చేయబోతుంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో ట్రాకర్‌ సిరీస్‌, సబ నయగన్‌ సినిమా, ఓజ్లర్‌ సినిమాలు స్ట్రీమింగ్‌ అవ్వబోతున్నాయి.

ఆహా ఓటీటీ ద్వారా వీరమారి లవ్‌ స్టోరీ అనే తమిళ సినిమా ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్‌ కానుంది.

ఇవే కాకుండా ఇంకా పలు ఓటీటీల్లో ఇంగ్లీష్ ఇతర భాషల సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్‌ అవ్వబోతున్నాయి. భాషతో ఇబ్బంది లేకుంటే అన్ని రకాల కంటెంట్ ఈ వారం ప్రేక్షకులకు వినోదాల విందు అందించేందుకు రెడీ అవుతున్నాయి.