Begin typing your search above and press return to search.

ఈవారం ఓటీటీ లో రాబోతున్న సినిమాలు ఇవే

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హాయ్‌ నాన్న సినిమా ఈ వారమే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Tupaki Desk   |   1 Jan 2024 11:36 AM GMT
ఈవారం ఓటీటీ లో రాబోతున్న సినిమాలు ఇవే
X

ప్రతి వారం థియేట్రికల్‌ రిలీజ్ కి పోటీగా పదుల కొద్ది సినిమాలు మరియు సిరీస్ లు ఓటీటీ ద్వారా పోటీ పడి మరీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. థియేటర్ లో సినిమాలు చూడటంను ఆర్థిక భారంగా భావించే వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్‌ చేస్తూ ఉంటారు. అలా ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు ఇంట్రెస్టింగ్‌ మూవీస్ రాబోతున్నాయి.

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హాయ్‌ నాన్న సినిమా ఈ వారమే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ లో 4వ తారీకున హాయ్ నాన్న సినిమా స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.

నాని హీరోగా మృణాల్ ఠాకూర్‌ హీరోయిన్‌ గా నటించిన హాయ్‌ నాన్న సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా కమర్షియల్‌ హిట్ ను దక్కించుకున్న నేపథ్యంలో చాలా మంది ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఈ వారం వారి ఎదురుచూపులకు తెర పడుతుంది.

ఇక కంగనా రనౌత్‌ హీరోయిన్ గా నటించిన క్రేజీ మూవీ తేజస్ ను జీ5 ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. థియేట్రికల్‌ రిలీజ్ లో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని దక్కించుకోలేక పోయింది. అయినా కూడా ఓటీటీ ద్వారా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయని అంతా విశ్వసిస్తున్నారు.

ఇంకా కొన్ని ఇతర భాషల సినిమాలు డబ్‌ అయ్యి మరియు కొన్ని ఇతర భాషల వెబ్‌ సిరీస్ లు ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. మొత్తానికి ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు కన్ఫర్మ్‌ గా తెలుస్తోంది.