Begin typing your search above and press return to search.

20+... ఈ వారం వినోదాల విందు

ఇక ఓటీటీ లో ఈ వారం జైలర్ తో పాటు దాదాపు 20 సినిమాలు, సిరీస్ లు ఇంకా షో లు ప్రేక్షకుల వినోదాల విందు కోసం రాబోతున్నాయి.

By:  Tupaki Desk   |   7 Sep 2023 12:03 PM GMT
20+... ఈ వారం వినోదాల విందు
X

తమిళ్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ చాలా కాలం తర్వాత జైలర్ సినిమా తో బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటాడు. అయిదు వందల కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన జైలర్ అంటూ సూపర్ స్టార్‌ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. మూడు వారాల్లోనే జైలర్‌ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కు రెడీ అవుతోంది. ఇంకా థియేటర్‌ లో ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

నేటి నుండి జైలర్‌ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. థియేటర్‌ స్క్రీనింగ్‌ మిస్ అయిన వారు ఓటీటీ స్ట్రీమింగ్ కు ఎగబడుతున్నారు. వీకెండ్‌ లో జైలర్ సినిమాను మరింత మంది చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఓటీటీ లో ఈ వారం జైలర్ తో పాటు దాదాపు 20 సినిమాలు, సిరీస్ లు ఇంకా షో లు ప్రేక్షకుల వినోదాల విందు కోసం రాబోతున్నాయి.

హిందీ సినిమా హడ్డీ ఈ మధ్య కాలంలో అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా లో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కీలక పాత్రలో నటించడం వల్ల మంచి క్రేజ్ దక్కింది. ఈ సినిమా ను జీ5 వేదికగా స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా కూడా నేటి నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్‌ రిలీజ్ మిస్ అయిన వారు ఓటీటీ స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యారు.

అమెజాన్ లో వన్ షాట్ అనే వెబ్‌ సిరీస్‌ ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. సిట్టింగ్‌ ఇన్ బార్స్ విత్‌ కేక్ అనే ఇంగ్లీష్ సినిమా ను కూడా అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ కు రెడీ అవుతుంది. ఆహా లో లవ్‌ అనే తమిళ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతుంది. మొత్తానికి నేడు రేపు పెద్ద ఎత్తున షో లు మరియు సినిమాలు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి, అవ్వబోతున్నాయి.