Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే..!

ఈ వారం ఏయే సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయో ఓసారి చూద్దాం.

By:  Tupaki Desk   |   31 July 2023 9:17 AM GMT
ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే..!
X

ప్రతివారం థియేటర్స్ లో సందడి చేయడానికి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. వాటి లో కొన్ని హిట్ అయితే, కొన్ని ఫట్ మంటాయి. అవి హిట్ అయినా, అవ్వకున్నా కొద్ది రోజుల కు ఓటీటీ లో అడుగుపెట్టడం చాలా కామన్. ప్రస్తుతం ఓటీటీ ప్రపంచమే నడుస్తోంది. అందుకే చాలా మంది థియేటర్ లో చూడని ప్లాప్ మూవీలను సైతం ఓటీటీ లో చూస్తూ ఉంటారు. అందుకే, ఏ వారం ఏ మూవీ ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి, ఈ వారం ఏయే సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయో ఓసారి చూద్దాం.

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, నాగ శౌర్య చాలా ఆశలుపెట్టుకున్నా, ఈ మూవీ పెద్దగా క్లిక్ అవ్వలేదు. కొద్దిగా కామెడీ వరకు క్లిక్ అయ్యింది. ఈ మూవీ ఆగస్టు 4వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ తెలియనివారు ఉండరు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ది హంట్ ఫర్ వీరప్పన్. ఈ సినిమా కూడా ఆగస్టు 4వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

నెట్ ఫ్లిక్స్ లోనే సోల్ క్యాచర్ అనే మరో మూవీ కూడా స్ట్రీమింగ్ కానుంది. ఓ సైనిక్ కంట్రాక్టర్ లైఫ్ గురించి ఈ మూవీలో చూపించనున్నారు. ఇది కూడా ఆగస్టు 4వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ లో గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 3 ఆగస్టు 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

ఇదే హాట్ స్టార్ లో దయా అనే ఓ తెలుగు వెబ్ సిరీస్ ఆగస్టు 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీని లో జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, యాంకర్ విష్ణు ప్రియ వంటి వారు నటించడం విశేషం. ఇక సోనీలివ్ లో పరేషాన్ అనే మూవీ స్ట్రీమింగ్ కానుంది. మసూదా హీరోతో హిట్ కొట్టిన హీరో ఈ మూవీ లో నటించాడు. అయితే, థియేటర్స్ లో పర్వాలేదు అనిపించిన ఈ మూవీ ఓటీటీ లో ఎంతవరకు ఆకట్టకుంటందో చూడాలి.

ఇదే సోనీ లివ్ లో పోర్ తొడిల్ అనే తమిళ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. మరి వీటిలో ఓటీటీ లో రికార్డులు కొల్ల గొట్టేది ఎవరోచూడాలి. కాగా, విడుదలై చాలా కాలం అవుతున్నా, ఏజెంట్, ఆదిపురుష్ లాంటి సినిమాలు ఇంకా ఓటీటీ కి రాలేదు. వాటి కోసం మాత్రం ప్రేక్షకులు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు.