Begin typing your search above and press return to search.

ఓటీటీ.. అనుకున్న డేట్ కంటే ముందే వచ్చారు

సంక్రాంతి అంటే చాలు పెద్ద, చిన్న సినిమాలు.. థియేటర్లలో వరుసగా విడుదల అవుతుంటాయి

By:  Tupaki Desk   |   14 Jan 2024 10:14 AM GMT
ఓటీటీ.. అనుకున్న డేట్ కంటే ముందే వచ్చారు
X

సంక్రాంతి అంటే చాలు పెద్ద, చిన్న సినిమాలు.. థియేటర్లలో వరుసగా విడుదల అవుతుంటాయి. కొవిడ్ మహమ్మారి తర్వాత థియేటర్లతో పాటు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న ఓటీటీల్లో కూడా కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు.. థియేటర్లలో నిరాశపరిచినా.. ఓటీటీలో అదరగొడుతున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరోలు కళ్యాణ్ రామ్, నితిన్ సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. థియేటర్లో రిలీజైన కొద్దిరోజులకే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్. అన్నీ తానై అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ కోసం భారీ సెట్స్ వేశారు. నటీనటుల కాస్ట్యూమ్స్ కోసం మెటీరియల్ ను ఇటలీ నుంచి తెప్పించారు. డిసెంబర్ 29న విడుదలైన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నా.. ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది.

ఇక, ఈ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలో ప్రత్యక్షం కానుంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ ఆదివారం(జనవరి 14) నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. పీరియాడిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ నటించింది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చగా మాళవిక నాయర్, అజయ్, సత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. 2023 ఏడాదికి ఈ మూవీ మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తుందని అంతా భావించారు. కానీ డెవిల్ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఫ్లాప్ గా నిలిచింది

మరోవైపు, టాలీవుడ్ నటుడు నితిన్, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన ఎక్స్‌ ట్రా ఆర్డినరీ మ్యాన్ డిసెంబర్ 8న థియేటర్ విడుదలైంది. యాక్షన్ కామెడీ జోనర్ లె తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాటు డిఫరెంట్ టైటిల్ తో రూపొందిన ఈ మూవీని వక్కంతం వంశీ డైరెక్ట్ చేశారు.

ఇప్పుడు జనవరి 19వ తేదీ నుంచి ఫేమస్ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. సినిమాలో కొన్ని అంశాలు ఆకట్టుకునేలా ఉండటం, ఫ్యామిలీ ఆడియెన్స్ కు సరిపోయే సినిమా అని తేలడంతో ఓటీటీలో మంచి రెస్పాన్స్ ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు.. మరి ఓటీటీల్లో ఈ రెండు సినిమాలు.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయో లేదో చూడాలి.