Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీ స్టఫ్.. ఏమేమి వస్తున్నాయంటే

ప్రతివారం డిజిటల్ ఓటీటీ ఛానల్స్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి

By:  Tupaki Desk   |   3 Jan 2024 3:45 AM GMT
ఈ వారం ఓటీటీ స్టఫ్.. ఏమేమి వస్తున్నాయంటే
X

ప్రతివారం డిజిటల్ ఓటీటీ ఛానల్స్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. థియేటర్స్ నుంచి ఓటీటీలోకి కొన్ని సినిమాలు వస్తుంటే, మరికొన్ని డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే వెబ్ సిరీస్ లకి అయితే కొదవే ఉండదు. అన్ని భాషలలో డిఫరెంట్ కథలతో కొత్త కొత్త వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకి వస్తాయి.

ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ వెబ్ సిరీస్ లని భాగానే ఆదరిస్తున్నారు. సీరియల్స్ కి డిమాండ్ తగ్గి ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ లకి డిమాండ్ పెరిగింది. ఇతర భాషలకి చెందిన వెబ్ సిరీస్ లని ఓటీటీ చానల్స్ లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తూ ఉండటంతో తెలుగు ఆడియన్స్ కి కూడా చేరువ అవుతున్నాయి. తెలుగునాట కొరియన్ డబ్బింగ్ వెబ్ సిరీస్ లకి మంచి ఆదరణ ఉంది.

ఇదిలా ఉంటే ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ ల సంగతి చూసుకుంటే నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ హాయ్ నాన్న నెట్ ఫ్లిక్స్ లో జనవరి 4న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ ఆశ్వాదించే అవకాశం ఉంది. నాని నుంచి వస్తోన్న మూవీ కావడంతో ట్రెండింగ్ లో వచ్చే ఛాన్స్ ఉంది.

తమిళ్ మూవీ కన్జూరింగ్ కన్నప్పన్ జనవరి 5న నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కాబోతోంది. హర్రర్ కామెడీ జోనర్ లో ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రెజినా కసండ్రా ఈ మూవీలో లీడ్ రోల్ లో నటించింది. కమెడియన్ సతీష్ హీరోగా నటించాడు. ఈటీవీ విన్ లో శివాజీ నటించిన వెబ్ సిరీస్ #90s వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతోంది.

ఇప్పటికే ఈ ట్రైలర్ కి పాజిటివ్ టాక్ వచ్చింది. శివాజీ డిజిటల్ ఎంట్రీ ఇస్తోన్న వెబ్ సిరీస్ కావడంతో కొంత ఆసక్తి నెలకొని ఉంది. జనవరి 5న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకి రానుంది. కంగనా రనౌత్ లీడ్ రోల్ లో నటించిన తేజాస్ మూవీ జీ5లో జనవరి 5న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. డిజిటల్ ఆడియన్స్ ని ఏ మేరకు ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. ఇక సోనీ లివ్ లో హిందీ వెబ్ సిరీస్ క్యూబికల్స్ సీజన్ జనవరి 5 నుంచి ప్రసారంలోకి రాబోతోంది.