Begin typing your search above and press return to search.

ఈ వారం ఏకంగా 22 సినిమా, సిరీస్ లు

ప్రతి వారం ప్రేక్షకులకి థియేటర్స్ ఎంటర్టైన్మెంట్ తో పాటు డిజిటల్ లో కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా అందుతుంది

By:  Tupaki Desk   |   8 Dec 2023 4:18 AM GMT
ఈ వారం ఏకంగా 22 సినిమా, సిరీస్ లు
X

ప్రతి వారం ప్రేక్షకులకి థియేటర్స్ ఎంటర్టైన్మెంట్ తో పాటు డిజిటల్ లో కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా అందుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వీకెండ్ అయ్యేసరికి థియేటర్స్ లో ఏ సినిమాలు వస్తున్నాయి అని కాకుండా ఏ ఓటీటీలో కొత్తగా ఏ వెబ్ సిరీస్ వస్తోందోనని వెతుకుతున్నారు. కాలక్షేపం కోసం వాటిని చూస్తున్నారు.

అలాగే ఈ వారం ఓటీటీలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఏకంగా 22 సినిమాలు, వెబ్ సోరీస్ లు స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. అవేంటి అనేది ఓ సారి చూసుకుంటే డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ అవికా గోర్ నటించిన హర్రర్ థ్రిల్లర్ తెలుగు సిరీస్ వధువు రిలీజ్ కాబోతోంది. హాలీవుడ్ మూవీ డైరీ ఆఫ్ ఏ విన్కీ కిడ్ క్రిస్మస్: క్యాబిన్ ఫీవర్ మూవీ రిలీజ్ కాబోతోంది.

నెట్‌ఫ్లిక్స్‌ జిగార్తాండ డబుల్ ఎక్స్ తెలుగు మూవీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. అలాగే అదృశ్య జలకంగల్‌ తెలుగు మూవీ కూడా రిలీజ్ అవుతోంది. హిందీ మూవీ దక్ దక్ కూడా స్ట్రీమింగ్ కాబోతోంది. అలాగే హిందీ మూవీ ద ఆర్చీస్, హాలీవుడ్ మూవీ లీవ్‌ ది వరల్డ్‌ రిలీజ్ కాబోతున్నాయి. కార్తి జపాన్ డిసెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ లో హిందీలో మస్త్‌ మైన్‌ రహానే కా హాలీవుడ్ మూవీస్ మేరీ లిటిల్‌ బ్యాట్‌ మ్యాన్‌, యువర్‌ క్రిస్మస్‌ ఆర్‌ మైన్‌ 2( హాలీవుడ్), స్పానిష్ మూవీ డేటింగ్‌ శాంటా, జర్మన్ మూవీ సిల్వర్‌ అండ్‌ ద బుక్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌, కన్నడ మూవీ టగరు పాళ్య స్ట్రీమింగ్ అవ్వనున్నాయి. దగ్గుబాటి అభిరామ్ నటించిన అహింస స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.

జీ 5హిందీ మూవీ కడక్‌ సింగ్‌, ఆహాలో మా ఊరి పొలిమేర 2, తరుణ్ భాస్కర్ కీడా కోలా రిలీజ్ కాబోతున్నాయి. బుక్‌ మై షోలో హాలీవుడ్ మూవీ ఫైవ్‌ నైట్స్‌ ఏట్‌ ఫ్రెడ్డిస్‌ టెలికాస్ట్ కాబోతోంది. సోనీ లివ్ లో హిందీ వెబ్ సిరీస్ చమక్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వారంలో డిజిటల్ కంటెంట్ ఇష్టపడేవారికి, ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సినంత వినోదం దొరుకుతుంది.