Begin typing your search above and press return to search.

హనుమాన్‌, భైరవకోన... ఈ వారం ఇంకా చాలా

ఇవి కాకుండా మరి కొన్ని డబ్బింగ్‌ సినిమాలు కూడా తెలుగు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. ఇక ఓటీటీ ద్వారా వినోదాల విందు అంతకు మించి అన్నట్లుగా ఎదురు చూస్తోంది.

By:  Tupaki Desk   |   4 March 2024 11:44 AM GMT
హనుమాన్‌, భైరవకోన... ఈ వారం ఇంకా చాలా
X

ప్రతి శుక్రవారం థియేటర్ల ద్వారా పెద్ద చిన్నా అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున సినిమాలు వస్తూనే ఉన్నాయి. థియేటర్‌ రిలీజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఓటీటీ ద్వారా కూడా పెద్ద ఎత్తున సినిమాలు మరియు సిరీస్ లు ఇంకా షో లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఓటీటీ ప్రేక్షకులకు ఎప్పటిలాగే ఈ వారం కూడా వినోదాల విందు ఖాయం.

థియేటర్ల ద్వారా ఈ వారం భీమా, గామి, ప్రేమలు, రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి సినిమాలు రాబోతున్నాయి. ఇవి కాకుండా మరి కొన్ని డబ్బింగ్‌ సినిమాలు కూడా తెలుగు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. ఇక ఓటీటీ ద్వారా వినోదాల విందు అంతకు మించి అన్నట్లుగా ఎదురు చూస్తోంది.

సంక్రాంతి కానుకగా విడుదల అయిన ప్రశాంత్‌ వర్మ, తేజ సజ్జా హనుమాన్ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు మార్చి 8న వచ్చేందుకు రెడీ అయ్యింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన హనుమాన్ సినిమాకు కచ్చితంగా ఓటీటీ లో మరోసారి హిట్ టాక్ రావడం ఖాయం. ప్రముఖ ఓటీటీ జీ5 లో హనుమాన్ స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.

అదే జీ5 లో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్‌ కిషన్‌ ఊరుపేరు భైరవకోన కూడా మార్చి 8న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మార్చి 6న ఈటీవీ విన్‌ ద్వారా వళరి అనే తెలుగు వెబ్‌ సిరీస్ స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. ఇవి కాకుండా ఇతర భాషల సినిమాలు సిరీస్ లు చాలానే రాబోతున్నాయి.

నెట్‌ప్లిక్స్ ద్వారా అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌, ది జెంటిల్‌మ్యాన్‌, డ్యాన్‌ సెల్‌, ది బ్యాక్‌ ఆఫ్‌ ప్లాన్‌, ఫుల్‌ స్వింగ్‌ ఇంకా పలు సినిమాలు రాబోతున్నాయి. ఇక అమెజాన్‌ ద్వారా బ్యాచిలర్‌ పార్టీ, సాగు, కెప్టెన్ మిల్లన్‌ హిందీ వర్షన్ స్ట్రీమింగ్‌ అవ్వబోతున్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో షో టైమ్‌ స్ట్రీమింగ్ అవ్వబోతుంది. మొత్తానికి ఈ వారం వినోదాల విందు ఖాయం.