Begin typing your search above and press return to search.

ఈ వారం ఒటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే?

వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ వారం కూడా ఒటీటీలో కొత్త సినిమాల సందడి ఉంది.

By:  Tupaki Desk   |   2 Oct 2023 9:56 AM GMT
ఈ వారం ఒటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే?
X

బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు డిజిటల్ ఒటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. ఆడియన్స్ కూడా ఒటీటీ ఛానల్స్ పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కుటుంబం అంతా ఇంట్లో హ్యాపీగా కలిసి సినిమాలు చూసుకునే అవకాశం ఒటీటీ ఛానల్స్ అందిస్తున్నాయి. అలాగే థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజుల్లోనే డిజిటల్ మాధ్యమాలలో సినిమాలు వచ్చేస్తున్నాయి.

వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ వారం కూడా ఒటీటీలో కొత్త సినిమాల సందడి ఉంది. వాటి సంగతి ఓ సారి చూసుకుంటే అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కి హిట్ టాక్ సొంతం చేసుకున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ ఈ నెల 5న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది. కచ్చితంగా ఈ మూవీ ఒటీటీలో కూడా ఆడియన్స్ ని మెప్పించే అవకాశాలు ఉన్నాయి.

బాలీవుడ్ లో ఈ ఏడాది పఠాన్, జవాన్ తర్వాత కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్దగ్గర సునామీ సృష్టించిన చిత్రం గద్దర్ 2. సన్నీ డియోల్, అమీషా పటేల్ లీడ్ రోల్ లో గద్దర్ కి సీక్వెల్ గా తెరకెక్కి రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంచనాలకి మించి కలెక్షన్స్ ని ఈ చిత్రం అందుకుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ అక్టోబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

సయ్యద్ సోహైల్ హీరోగా శ్రీనివాస వింజంపాటి దర్శకత్వంలో వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. ఈ చిత్రంలో రూప కొడవాయూర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో కూడా అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 6న రిలీజ్ కాబోతోంది. హాలీవుడ్ లో హర్రర్ మూవీస్ సిరీస్ లో భాగమైన నన్ 2 మూవీ బుక్ మై షోలో అక్టోబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతోంది.

కార్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన గ్రాన్ ట్యూరిస్మో మూవీ హాలీవుడ్ లో రిలీజ్ అయ్యి పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది. ఈ చిత్రం కూడా బుక్ మై షోలోనే అక్టోబర్ 5 నుంచి అందుబాటులోకి రాబోతోంది. మరి ఈ చిత్రాలలో డిజిటల్ ఆడియన్స్ ని ఎన్ని మూవీస్ ఎంటెర్టైన్ చేస్తాయనేది చూడాలి.