Begin typing your search above and press return to search.

OTT : హ్యాట్రిక్ ఎంటర్‌టైన్మెంట్‌ రెడీ

ఈ వారం థియేటర్ల ద్వారా చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో గీతాంజలి మళ్లీ వచ్చింది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది

By:  Tupaki Desk   |   8 April 2024 11:25 AM GMT
OTT : హ్యాట్రిక్ ఎంటర్‌టైన్మెంట్‌ రెడీ
X

ప్రతి వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా ఏ స్థాయిలో సినిమాలు వస్తున్నాయో ఓటీటీ ద్వారా కూడా అదే స్థాయిలో సినిమాలు, సిరీస్ లు వస్తూ వినోదాన్ని పంచుతున్నాయి. ఈ మధ్య కాలంలో థియేటర్ల కంటే ఓటీటీ లోనే ఎక్కువ మంది సినిమాలను చూస్తున్నారు.

ఈ వారం థియేటర్ల ద్వారా చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో గీతాంజలి మళ్లీ వచ్చింది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఓటీటీ సినిమాల విషయానికి వస్తే ఈ వారం మోస్ట్‌ అవైటెడ్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ప్రేమలు తెలుగు లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. డబ్బింగ్ వర్షన్‌ సాధించిన వసూళ్లు బాక్సాఫీస్ వర్గాలను సైతం ఆశ్చార్యానికి గురి చేశాయి. అలాంటి సినిమా ఓటీటీ ద్వారా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో ఈనెల 12న స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

విశ్వక్ సేన్ నటించిన ప్రయోగాత్మక సినిమా గామి థియేటర్ రిలీజ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ కోసం కూడా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. జీ 5 లో ఈ సినిమా ను 12వ తారీకున స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.

ఇక కామెడీ మూవీ ఓం భీమ్‌ బుష్ కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా లో శ్రీ విష్ణు, ప్రియదర్శి మరియు రాహుల్ రవీంద్రన్‌ లు నటించారు. థియేట్రికల్‌ రిలీజ్ లో ఆశించిన ఫలితాన్ని సాధించలేక పోయిన ఈ సినిమా ఓటీటీ లో మాత్రం కచ్చితంగా మెప్పిస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు. అమెజాన్ ప్రైమ్‌ లో ఈ సినిమా 12వ తారీకు నుంచి స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.

ఈ మూడు సినిమాలు కూడా హ్యాట్రిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ను తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు అందించడం ఖాయం అంటూ మీడియా వర్గాల వారు మరియు ఆయా చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.