హీరో - ఓటీటీ మధ్యలో నిర్మాత పుట్ బాల్ మాదిరి!
`హరిహర వీరమల్లు` ఇప్పటికే ఎన్నిసార్లు రిలీజ్ వాయిదా పడిందో తెలిసిందే. మార్చి 28న రిలీజ్ అవ్వాల్సిన సినిమా మే 9కి వాయిదా పడింది.
By: Tupaki Desk | 9 April 2025 5:39 PM IST`హరిహర వీరమల్లు` ఇప్పటికే ఎన్నిసార్లు రిలీజ్ వాయిదా పడిందో తెలిసిందే. మార్చి 28న రిలీజ్ అవ్వాల్సిన సినిమా మే 9కి వాయిదా పడింది. ఈసారి మాత్రం కచ్చితంగా రిలీజ్ అవుతుందని అభిమా నులు చాలా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ నాలుగు రోజులు డేట్లు ఇస్తే పనైపోతుందని మేకర్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఆయనేమో ఇవ్వడం లేదు. తాజాగా పవన్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురవ్వడంతో? పవన్ సింగపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే.
సింగపూర్ నుంచి పవన్ రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలిదు. పెద్ద ఘటనే అంటూ పవన్ కూడా టెన్షన్ లోనే ఉన్నారు. తాజా పరిస్థితి చూస్తుంటే పీకే వచ్చే సరికి చాలా రోజులు పట్టేలా ఉంది. ఇదే టెన్షన్ తో వీరమల్లు మేకర్స్ ఉన్నారు. తాజాగా ఇప్పుడు గుండెల్లో మరో పిడుగు లాంటి వార్త పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ అన్ని భాషలకు సంబంధించి అమోజాన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ ఒప్పందం చాలా కాలం క్రితమే ముగిసింది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ పై అమెజాన్ ఒత్తిడి మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో మే 9న వీరమల్లు రిలీజ్ అవ్వాలని ఖండీషన్ పెట్టింది. ఒకవేళ రిలీజ్ కాకపోతే డిజిటల్ డీల్ లో 50 శాతం కోత విధిస్తామంటూ అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలొస్తున్నాయి. అది జరగకపోతే మొత్తం ఒప్పందాన్నే రద్దు చేసుకోవాలని సదరు సంస్థ ఆలోచన చేస్తుందని ఉప్పందింది.
దీనికి సంబంధించి తమ నిర్ణయాన్ని దర్శక, నిర్మాతలకు క్లియర్ గా తెగేసి చెప్పేసారుట. ఈ సంగతి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్లిందంటున్నారు. దీంతో నిర్మాతలకు ఇదో కొత్త టెన్షన్ గా మారింది. ఓ వైపు పీకే ఎప్పుడొస్తాడో తెలియదు? మరో వైపు ఓటీటీ ఒత్తిడి నడుమ నిర్మాతలు నలిగిపోతున్న సన్నివేశం కనిపిస్తుంది. మొత్తానికి అటు పవన్...ఇటు ఓటీటీ నిర్మాతని పుట్ బాల్ ఆడుకుంటున్నారుగా.
