Begin typing your search above and press return to search.

నిర్మాతలకు మరో షాక్ ఇచ్చిన ఓటీటీలు..!

పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ ని శాసిస్తున్న తెలుగు సినిమా రేజ్ ఒక పక్క కనిపిస్తుంటే.. అదే తెలుగు పరిశ్రమ ఏడాదికి వందల కొద్దీ సినిమాలు రిలీజ్ అవుతున్నా వాటిలో సూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టేవి వేళ్లతో లెక్క పెట్టే విధంగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   2 Dec 2025 2:00 PM IST
నిర్మాతలకు మరో షాక్ ఇచ్చిన ఓటీటీలు..!
X

పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ ని శాసిస్తున్న తెలుగు సినిమా రేజ్ ఒక పక్క కనిపిస్తుంటే.. అదే తెలుగు పరిశ్రమ ఏడాదికి వందల కొద్దీ సినిమాలు రిలీజ్ అవుతున్నా వాటిలో సూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టేవి వేళ్లతో లెక్క పెట్టే విధంగా ఉన్నాయి. ఇది చాలదు అన్నట్టుగా ఓటీటీ సంస్థలు పెడుతున్న కండీషన్స్ నిర్మాతలకు మరింత టెన్షన్ పెట్టేస్తున్నాయి. ఒకప్పుడు సినిమా థియేట్రికల్ రైట్స్ ఎలా ఉన్నా డిజిటల్ రైట్స్ తో నిర్మాత సేఫ్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలుస్తుంది.

స్టార్ సినిమాలు సెట్స్ మీద ఉండగానే..

స్టార్ సినిమాలు సెట్స్ మీద ఉండగానే ఓటీటీల ఆఫర్లకు టెంప్ట్ అవ్వడంతో వాళ్లు చెప్పిన టైం కు సినిమా రిలీజ్ చేయాలనే కండీషన్స్ పెడుతున్నారు. అందుకే కొన్ని సినిమాలు రిలీజ్ తర్వాత ఓటీటీ రైట్స్ సేల్ చేస్తున్నారు. ఐతే ఇప్పుడు కొత్తగా ఓటీటీ సంస్థలు నిర్మాతలకు మరో కండీషన్ కూడా పెడుతున్నాయట. సినిమాను ఓటీటీ రైట్స్ డీల్ ఆ సినిమా థియేట్రికల్ రన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని మెలిక పెట్టారట.

ఏదైతే ఒక సినిమాకు ఓటీటీ రైట్స్ ఒక రేటు ఫిక్స్ చేస్తారో.. ఆ సినిమా థియేట్రికల్ రిలీజై సక్సెస్ అయితే ఆ రేటు ఇస్తారట. ఒకవేళ థియేట్రికల్ రన్ ఆ లెక్కకు రీచ్ కాకపోతే ఓటీటీ రైట్స్ లో 25 శాతం కోత ఉంటుందని అంటున్నారట. ఇలాంటి కండీషన్స్ తోనే అగ్రిమెంట్స్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే ఓటీటీల ద్వారా సినిమాలకు నష్టం జరుగుతుందని భావిస్తుండగా ఇప్పుడు ఈ కండీషన్ వల్ల నిర్మాతకు మరింత లాస్ వచ్చేలా ఉంది.

ఓటీటీలు కొత్త కండీషన్స్..

కొన్ని సినిమాలు బాగున్నా సరే థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ అవ్వదు. డిజిటల్ రిలీజ్ లో ఆ సినిమాను ఎంకరేజ్ చేస్తారు. మరి ఓటీటీ కొత్త కండీషన్స్ కి కూడా కొంతమంది నిర్మాతలు ఓకే అనేస్తున్నా మెజారిటీ నిర్మాతలు మాత్రం వారి నిర్ణయాన్ని ఆమోదించట్లేదు. ఓటీటీల చేతుల్లో సినిమా పరిశ్రమ అన్న రేంజ్ లో వారికి వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు వాళ్లు ఎలా చెబితే అలా అన్న మాదిరిగా నిర్మాతల ఓకే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఓటీటీల ఈ కొత్త కండీషన్స్ పై నిర్మాతలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సినిమా బడ్జెట్ లు ఎక్కువ అవ్వడం.. దానికి ఓటీటీలతో ముందే డీల్ సెట్ చేసుకుని బడ్జెట్ రికవర్ చేయడం లాంటివి చేయడం వల్ల సినిమా నిర్మాణంలోనే ఓటీటీల ఇన్వాల్వ్ మెంట్ స్టార్ట్ అవుతుంది. అందుకే సినిమా రిలీజ్ డేట్ నుంచి, ఓటీటీ రిలీజ్ వరకు వారి ప్రభావం ఉంటుంది. ఐతే అంతకుముందు సినిమా డిజిటల్ రిలీజ్ విషయంలో నిర్మాతలు తీసుకున్న 8 వారాల కండీషన్స్ కూడా కొన్నాళ్లు పాటించి ఆ తర్వాత ఎవరికి వారు తమ సినిమాలను ఇష్టం వచ్చినట్టుగా రిలీజ్ చేశారు.