మ్యాట్నీ నుంచే వాకౌట్..ఆ మాత్రమైనా లేకపోతే కష్టం!
ఓటీటీ మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక పరిస్థితి అంతకంతకు దారుణంగా మారిందన్నది వాస్తవం.
By: Tupaki Desk | 13 Jun 2025 9:00 AM ISTఒకప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయిందంటే? సినిమా ఎలా ఉన్నా వారం రోజుల పాటు థియేటర్లు హౌస్ పుల్ అయ్యేవి. వెండి తెరపై అభిమాన హీరో-హీరోయిన్ చూడటానికైనా థియేటర్ కు వెళ్లేవారు. థియేటర్లో వారం రోజులు ఆడితే కొంత వరకూ నష్టం భర్తీ అయ్యేది. పరిమిత బడ్జెట్ చిత్రాలు కావడంతో కొంత వరకూ నిర్మాతకు ఆ రకంగా సౌలభ్యం దొరికేది. నేటి సినిమా సన్నివేశం పూర్తిగా మారిన సంగతి తెలిసిందే.
ఓటీటీ మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక పరిస్థితి అంతకంతకు దారుణంగా మారిందన్నది వాస్తవం. థియేట ర్లో సినిమా ఆడాలంటే కాంబినేషన్లు కాదు. హీరో ఇమేజ్ కాదు. కేవలం కంటెంట్ మాత్రమే కీలక పాత్ర పోషిస్తుంది. అలా బలమైన కంటెంట్ ఉన్న సినిమాకు వసూళ్లు నల్లేరు మీద నడకలా మారింది. చిన్న సినిమా సైతం 100 కోట్లు సునాసాయంగా సాధిస్తుంది. మరి మ్యాటర్ లేని సినిమాల సంగతేంటి అంటే? మ్యాట్నీ నుంచే వాకౌట్ అయ్యే పరిస్థితి తలెత్తిందన్నది కళ్ల ముందు కనిపిస్తుంది.
మార్నింగ్ షో టాక్ బాగుంది అంటే గట్టెక్కినట్లు. లేదంటే? మ్యాట్ని నుంచే థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ లు కూడా రద్దవుతున్నాయి. రద్దు కాని పక్షంలో సమయం వృదా దేనికనే పరిస్థితి కి ఆడియన్స్ వచ్చేసారు. యావరేజ్, బిలో యావరేజ్ గా ఉన్న ఓ సెక్షన ఆడియన్స్ థియేటర్ వచ్చే పరిస్థితి ఉంది. కానీ కంటెంట్ ఏమాత్రం లేదంటే? సినిమా దివాళా తీయాల్సిన పరిస్థితే కనిపిస్తుంది.
ఇక్కడ హీరో ఇమేజ్ తో పనిలేదు. డైరెక్టర్ కంటెంట్ తో పనిలేదు. గత సక్సెస్ లు చూసి వచ్చే పరిస్థితి అంతన్నా కనిపించడం లేదు. రైట్ నౌ ఏంటి? కీలకంగా మారింది. ఈ కోణంలో ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.పెట్టిన డబ్బుకు తగ్గ ఆస్వాదన దొరుకుతుందా? లేదా? అన్న ధోరణి ప్రేక్షకుల్లో బలంగా కనిపిస్తుంది. ఒకప్పుడు మలయాళం, తమిళం నుంచి ఎంత గొప్ప సినిమాలు రిలీజ్ అయినా తెలుగులో ఆడేవి కాదు.
కానీ నేడు కంటెంట్ ఉన్న పరభాషా చిత్రాల సక్సెస్ తెలుగులో ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తున్నాయి! అన డానికి ఎన్నో సినిమాలు ఉదహరించొచ్చు. ప్రేక్షకుడు వాకౌట్ చేయడానికి సోషల్ మీడియా రివ్యూలు కూడా కీలకంగా మారుతున్నాయి. వాళ్లు ఇచ్చే రేటింగ్స్ 70 శాతం సినిమాను డిసైడ్ చేసేస్తున్నాయి. మును మందు కొన్ని ప్రముఖ సినిమా వెబ్ సైట్లు ఇచ్చే రివ్యూలు సినిమాకు మరింత కీలకంగా మారే ఛాన్స్ ఉంది.
