నెట్ ఫ్లిక్స్ టాప్-10.. లిస్ట్ లో హిట్-3, ఛావా
ఓటీటీల్లో నెట్ ఫ్లిక్స్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రతి వారం కచ్చితంగా కొత్త కంటెంట్ ను స్ట్రీమింగ్ చేస్తుంటుంది.
By: Tupaki Desk | 5 Jun 2025 8:50 PM ISTఓటీటీల్లో నెట్ ఫ్లిక్స్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రతి వారం కచ్చితంగా కొత్త కంటెంట్ ను స్ట్రీమింగ్ చేస్తుంటుంది. అందుకే టాప్ స్ట్రీమింగ్ యాప్ అంటే నెట్ ఫ్లిక్స్ అని చాలా మంది చెబుతుంటారు. 2025లో ఇప్పటికే ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు.. క్రేజీ వెబ్ సిరీస్ లను తీసుకొచ్చింది.
ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్, డ్రామా ఓరియెంటెడ్ సహా అనేక జోనర్స్ లో సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. అయితే నెట్ ఫ్లిక్స్ ప్రతివారం గ్లోబల్, ఇండియా టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్ ను రిలీజ్ చేస్తూ సందడి చేస్తుంటుంది. ఆ విధంగా ఈసారి కూడా (మే 26 - జూన్ 1) జాబితా విడుదల చేసింది. మరి అందులో ఉన్న సినిమాలు ఏంటంటే..
1. హిట్-3
2. సికందర్
3. రెట్రో
4. ది డిప్లొమాట్
5. జాక్
6. గుడ్ బ్యాడ్ అగ్లీ
7. కోర్ట్ స్టేట్ వర్సెస్ ఎనోబడీ
9. ఛావా
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటించిన హిట్- ది థర్డ్ కేస్ థియేటర్స్ మే 1వ తేదీన రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఆ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కూడా దూసుకుపోతోంది. స్ట్రీమింగ్ అయిన కాసేపటి నుంచే ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. ఇప్పుడు ట్రెండింగ్ నెం.1గా నిలిచింది.
ఆ తర్వాత రెండు స్థానాల్లో సల్మాన్ ఖాన్ సికిందర్, సూర్య రెట్రో చిత్రాలు ఉన్నాయి. ఏఆర్ మురుగదాస్ సికిందర్ మూవీకి దర్శకత్వం వహించగా.. కార్తీక్ సుబ్బరాజ్ రెట్రో సినిమాను తెరకెక్కించారు. రెండు మూవీలు థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ ను మెప్పించలేదు. కానీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి.
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించిన ది డిప్లొమాట్, టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ లో వచ్చిన జాక్, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు.. టాప్-10లో ఉన్నాయి. వాటితో పాటు పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఛావా కూడా ఉంది. మరి ఆ సినిమాలన్నీ మీరు చూశారా?
