Begin typing your search above and press return to search.

ఊరుపేరు బైరవకోన డే 1.. బాక్సాఫీస్ లెక్క ఎంతంటే?

ఇక ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   17 Feb 2024 6:52 AM GMT
ఊరుపేరు బైరవకోన డే 1.. బాక్సాఫీస్ లెక్క ఎంతంటే?
X

ఫాంటసీ డ్రామాగా థ్రిల్ చేసేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఊరు పేరు భైరవకోట సినిమా విడుదలకు ముందే వరుస అప్డేట్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా సినిమా మీద నమ్మకంతో చిత్ర నిర్మాతలు చాలా ఏరియాలలో అడ్వాన్స్ ప్రీవియర్స్ కూడా ప్రదర్శించారు. వాటికి కూడా పరవాలేదు అనే విధంగా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. ఇక ఆ నమ్మకంతో సినిమాను ఈ శుక్రవారం గ్రాండ్ గా విడుదల చేశారు.


ఇక ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. సందీప్ కిషన్ కెరీర్ లోనే ఇది బెస్ట్ ఓపెనింగ్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా చెప్పవచ్చు. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను AK ఎంటర్టైన్మెంట్స్ హాస్య మూవీస్ నిర్మించాయి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది.

దర్శకుడు ఆనంద్ ఈ సినిమాలో మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో చూపించిన విధానం ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫస్ట్ అఫ్ కామెడీ సన్నివేశాలు కూడా బాగా హైలైట్ అయ్యాయి. ఇక వెన్నెల కిషోర్ వైవాహర్ష కామెడీ కూడా ఈ సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. హీరో సందీప్ కిషన్ వర్ష మధ్యలో వచ్చిన లవ్ సీన్స్ కూడా కీలకంగా నిలిచాయి.

ఇక చాలా రోజుల తర్వాత ఇలాంటి మిస్టరీ తరహా సినిమా రావడంతో బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు మంచి రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా మాస్ సెంటర్లలో కూడా ఈ సినిమా జనాలతో రద్దీగా కనిలించింది. ఇక పోటీగా ప్రస్తుతం పెద్దగా సినిమాలు ఏమీ లేవు కాబట్టి భైరవకోనకు ఇది మంచి అవకాశం. ఫస్ట్ డే 6.03 కోట్ల వచ్చాయి అంటే మామూలు విషయం కాదు.

ముందుగా ప్రీమియర్స్ ప్రదర్శించడం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఇక ఈ వీకెండ్ ఇదే తరహాలో కొనసాగితే పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సోమవారం అసలు పరీక్ష మొదలవుతుంది. చూడాలి మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో లాభాలను అందుకుంటుందో.