Begin typing your search above and press return to search.

ఊరు పేరు బైరావకోన.. నైజాం లెక్క ఇది!

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఊరు పేరు భైరవకోన సినిమా బాక్స్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ అందుకుంది.

By:  Tupaki Desk   |   20 Feb 2024 9:47 AM GMT
ఊరు పేరు బైరావకోన.. నైజాం లెక్క ఇది!
X

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఊరు పేరు భైరవకోన సినిమా బాక్స్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఈ సినిమా విడుదలకు ముందే కొన్ని ఏరియాలలో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించారు. వాటికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మిస్టరీ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన OPBK సినిమా మాస్ క్లాస్ ఏరియాలలో కూడా డీసెంట్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది.


ఇక మొదటి వీకెండ్ మాత్రమే కాకుండా వీకెండ్ తర్వాత కూడా కలెక్షన్స్ బాగానే వస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చినట్లుగా చిత్ర నిర్మాతలు అధికారికంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఒక్క నైజం ఏరియాలోనే ఈ సినిమా దాదాపు 5కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

సందీప్ కిషన్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో టాప్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఇక దర్శకుడు వీఐ ఆనంద్ ప్రతిసారి తన కథలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తూ ఉన్నాడు. అతని కెరీర్ కు కూడా ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు.

అంతే కాకుండా నేడు దర్శకుడు ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ అనౌన్స్ మెంట్ కూడా రావడం జరిగింది. ఈ సినిమాకు సమర్పకుడిగా ఉన్న ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర దర్శకుడు ఆనంద్ తో ఒక క్రేజీ ప్రాజెక్టును స్టార్ట్ చేయబోతున్నట్లు తెలియజేశారు. A టీవీ ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మించబోయే 27వ సినిమాకు ఆనంద్ దర్శకత్వం వహించబోతున్నాడు అని ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

అయితే అందులో ఎవరు నటిస్తున్నారు అనే విషయాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే మరొక అప్డేట్ ద్వారా పూర్తి వివరాలు తెలియజేస్తామని అన్నారు. దర్శకుడు వీఐ ఆనంద్ గతంలో అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా చేయాలని చర్చలు జరిపాడు. తప్పకుండా భవిష్యత్తులో మాత్రం హై రేంజ్ లో పెద్ద హీరోలతో కూడా సినిమాలు చేస్తాను అని ఈ దర్శకుడు ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మరి అల్లు అర్జున్ తో ప్రాజెక్టును ఎప్పుడూ స్టార్ట్ చేస్తాడో చూడాలి.