Begin typing your search above and press return to search.

కుర్రాళ్ల కొత్త క్ర‌ష్ ట్రిప్తి దిమ్రీతో ఓర్రి

ఆస‌క్తిక‌రంగా.. ఓర్రి అలియాస్ ఆవ్ర‌త‌మ‌ణితో త్రిప్తి దిమ్రీ స్పెష‌ల్ గా ఫోజులిచ్చిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   14 Jan 2024 3:30 PM GMT
కుర్రాళ్ల కొత్త క్ర‌ష్ ట్రిప్తి దిమ్రీతో ఓర్రి
X

'యానిమల్` స్టార్ ట్రిప్తి డిమ్రీ తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ తో ఇటీవ‌ల చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఈ బ్యూటీ ఇటీవలి ఈవెంట్‌లో గ్లామరస్ లుక్ తో క‌ట్టి ప‌డేసింది. ట్రిప్తి మునుప‌టితో పోలిస్తే డ్రెస్సింగ్ సెన్స్ పరంగా హాట్ నెస్ ప‌రంగా చెల‌రేగిపోతోంది. స‌రికొత్త‌ నేష‌న‌ల్ క్ర‌ష్ గా కుర్రాళ్ల హృద‌యాల్లో చేరి గిలిగింత‌లు పెడుతున్న ట్రిప్తి కోస‌మే త‌యారు చేసిన స్పెష‌ల్ టైలర్డ్ సిల్హౌట్ డిజైనర్ గౌన్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆస‌క్తిక‌రంగా.. ఓర్రి అలియాస్ ఆవ్ర‌త‌మ‌ణితో త్రిప్తి దిమ్రీ స్పెష‌ల్ గా ఫోజులిచ్చిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.


ట్రిప్తి ధ‌రించిన‌ గౌన్ ధ‌ర అక్ష‌రాలా 1.53 ల‌క్ష‌లు. ఖ‌రీదైన డిజైన‌ర్ గౌన్ లో ట్రిప్తి ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపించింది. ఈవెంట్లో ట్రిప్తి లుక్ కి అద్భుతమైన ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఆస‌క్తిక‌రంగా ఈ లుక్ కి త‌గ్గ‌ట్టుగా తేలిక‌పాటి బంగారు ఆభరణాలను ట్రిప్తి ఎంచుకుంది. త‌న‌ వేలిని అలంకరించుకున్న‌ వెండి-టోన్, భారీ-సైజ్డ్‌ వేలి ఉంగరం అదనపు ఆక‌ర్ష‌ణ‌ను పెంచాయి. త్రిప్తి అందమైన సిల్వర్ గ్లాడియేటర్ హై హీల్స్‌తో ఫ్యాష‌న్ కంటెంట్ ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లింది. త్రిప్తి తన పెదవులకు గ్లాస్ మెరుస్తున్న అందమైన గులాబీ రంగు లిప్‌స్టిక్ తో స్పెష‌ల్ గా క‌నిపించింది. పసుపు రంగు గౌను సింపుల్ మేకప్‌లో త్రిప్తి డిమ్రీ త‌న ప్ర‌త్యేక‌త‌ను ఎలివేట్ చేయ‌డంలో విఫ‌లం కాలేదు. ఇంత‌కీ ఈవెంట్ ఎక్క‌డ‌? అంటే.. ముంబైలో జరిగిన ఆజియో లక్స్ వీకెండ్‌లో ట్రిప్తి ర్యాంప్ వాక్ చేయ‌డ‌మే గాక‌ షోస్టాపర్‌గా నిలిచింది. ర్యాంప్‌పై ధరించే ఎలివేట్ చేస్తూ ఈజీ స్టైల్ లో ట్రిప్తి రిఫ్రెష్‌గా క‌నిపించింది.

స్పిరిట్- ఆషిఖి 3లో ఛాన్సులు:

సందీప్ వంగా `యానిమల్` విడుదలకు ముందు ట్రిప్తీ డిమ్రీ ఎవ‌రో ఎవరికీ తెలీదు. అప్ప‌టికి కేవ‌లం ఓటీటీ స్టార్. కానీ రణబీర్ కపూర్ నటించిన యానిమ‌ల్ చిత్రం విడుదలైన తర్వాత ఈ బ్యూటీ మాస్‌లో ప్రజాదరణ పొందడమే కాకుండా కొత్త జాతీయ క్రష్‌గా మారింది. యానిమ‌ల్ లో జోయాగా ట్రిప్తీ న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. ట్రిప్తీకి ర‌క్తి క‌ట్టించే సన్నివేశాలలో రణబీర్‌తో నటించే అవకాశం వచ్చింది. అనంత‌రం ట్రిప్తి దిమ్రీ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. సందీప్ వంగానే తెర‌కెక్కించే త‌దుప‌రి చిత్రం స్పిరిట్ లో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న అవ‌కాశం ద‌క్కించుకుంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది. వ‌రుస‌గా అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలొస్తున్నాయి. టాలీవుడ్ లో ఛాన్సులొస్తున్నాయ‌ని చెబుతున్నారు.

అలాగే బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ ఆషిఖి త‌దుప‌రి భాగంలో న‌టించే అవ‌కాశం త‌న‌ను వెతుక్కుంటూ వ‌చ్చింద‌ని టాక్ వినిపించింది. ఆషిఖి 3లో కార్తిక్ ఆర్యన్ సరసన ట్రిప్తీ డిమ్రీ సంతకం చేసిందని క‌థ‌నాలొచ్చాయి. అయితే దీనిని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.