Begin typing your search above and press return to search.

ఒర్రీ వీపందం ఇలా చింపేసిన టీష‌ర్ట్ లో!

వెనుక టీషర్ట్ చూస్తే చినిగిపోయింది. వీపంతా క‌నిపిస్తుంది. అది చూస్తే ఎవ‌రో అత‌డిని చిత‌క‌బాది టీష‌ర్ట్ చింపేసి ఉంటారు అనుకుంటాం.

By:  Tupaki Desk   |   8 Jun 2024 1:30 PM GMT
ఒర్రీ వీపందం ఇలా చింపేసిన టీష‌ర్ట్ లో!
X

సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో ఒర్రీ అలియాస్ అవ్ర‌త‌మ‌ణి ఒక సంచ‌ల‌నం. సోషల్ మీడియాలో ఓర్రీ నిరంతరం చ‌ర్చ‌ల్లో నిలుస్తున్నాడు. అతడు అన్ని సినిమా పార్టీలు ఫంక్ష‌న్ల‌లో కనిపిస్తున్నాడు. న‌ట‌వార‌సురాళ్ల‌తో పాటు, పెద్ద స్టార్స్ తోను స‌న్నిహితంగా ఉన్నాడు. హిందీ చిత్ర పరిశ్రమలోని ప్రతి స్టార్‌కి ఒర్రీతో అనుబంధం ఉంది. స్టార్ కిడ్స్ కి అత్యంత స‌న్నిహితంగా ఉన్న అత‌డి ఫోటోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో హాట్ టాపిక్ గా మారాయి.

ఓర్రీ ఇండ‌స్ట్రీలో జ‌రిగే అతిపెద్ద పార్టీలలో నిరంత‌రం క‌నిపిస్తాడు. నైట్ పార్టీల్లో అత‌డే స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్. స‌ల్మాన్ తో బిగ్ బాస్ షోలోను అత‌డి ఎపిసోడ్ సంచ‌ల‌నం అయింది. ఓర్రీ ఎప్పుడూ ఖాళీగా పార్టీల్లో తిరుగుతుంటాడు. జీవనోపాధి కోసం ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. కానీ నిరంత‌రం నైట్ పార్టీల‌లో అత‌డు మెరుస్తుంటాడు. స్టార్‌లతో అతడి స్నాప్‌లు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓర్రీ నైట్ వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది.

అందులో మ‌రోసారి త‌న‌ద‌మైన మార్క్ డ్రెస్సింగ్స్ సెన్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ప్యాంట్..టీష‌ర్ట్ ధ‌రించాడు. పార్టీ ముగించుకుని కారు ఎక్కి ఇంటికి వెళ్లిపోతున్నాడ‌నుకున్నారంతా. కానీ ఇంత‌లోనే స‌ర్ ప్రైజ్ చేసాడు. వెనుక టీషర్ట్ చూస్తే చినిగిపోయింది. వీపంతా క‌నిపిస్తుంది. అది చూస్తే ఎవ‌రో అత‌డిని చిత‌క‌బాది టీష‌ర్ట్ చింపేసి ఉంటారు అనుకుంటాం. కానీ అలాంటి స‌న్నివేశం కాదిది. అత‌డి రాక‌ని క‌నిపెట్టినకెమారాలు టపీ ట‌పీ మ‌ని క్లిక్ మ‌నిపించాయి. వాటి వైపు చూసి ఏమీ తెలియ‌ని అమాయ‌కుడి ఎక్స్ ప్రెష‌న్ తో ఓన‌వ్వు న‌వ్వేసాడు.

ఒర్రీనా మ‌జాకానా? అంటూ మాట్లాడ‌టం నెటి జ‌నుల వంతైంది. ఒర్రీ ఇలాంటి బ‌ట్ట‌లేసుకునే అంత ఫేమ‌స్ అయిపోయాడు. సినిమాలు చేయ‌క‌పోయినా ...న‌టుడికాక‌పోయినా సోష‌ల్ మీడియాలో ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఉర్పీ జావేద్ లాగే ఇత‌డు కూడా ఎంతో ఫేమ‌స్. వెరైటీగా ఎవ‌రు ట్రై చేసినా ఇలా స‌క్సెస్ అవ్వ‌డానికి ఛాన్స్ ఉంది.