Begin typing your search above and press return to search.

'బిగ్ బాస్‌'లో పాదం మోపిన‌ ఓర్రీ

ఇదిలా ఉంటే ఓర్రీ ఇప్పుడు మ‌రో ఘ‌న‌త‌ను సాధించ‌బోతున్నాడు. ఇంత‌లోనే ఓర్హాన్ అవత్రమణి.. సల్మాన్ ఖాన్ రియాల్టీ షోలో తన ఎంట్రీని కన్ఫర్మ్ చేశాడు.

By:  Tupaki Desk   |   23 Nov 2023 4:13 PM GMT
బిగ్ బాస్‌లో పాదం మోపిన‌ ఓర్రీ
X

సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో స్టార్ కిడ్స్ నుంచి స్టార్ హీరోయిన్స్ వ‌ర‌కూ ప్ర‌తి ఒక్క‌రితో చ‌నువుగా ఉండే ఓర్రీ అలియాస్ అవ్ర‌త‌మ‌ణి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అత‌డు ఇప్ప‌టికే ముంబై మీడియాతో పాటు, ఇటు సౌత్ మీడియా దృష్టిలో ఉన్నాడు. ఇటీవ‌ల అత్యంత వేగంగా మీడియాలో పాపులారిటీ సంపాదించిన నిరుద్యోగిగా అత‌డి పేరు మార్మోగింది. సెల‌బ్రిటీ కిడ్స్ తో నిరంత‌రం పార్టీల్లో మునిగి తేలే అత‌డి జాత‌క‌మేమిటో తెలుసుకోవాల‌నే త‌హ‌తహ కూడా యూత్ కి ఉంది.

అత‌డు రిల‌య‌న్స్ అంబానీల‌కు స‌న్నిహితుడిగా క‌నిపించ‌డంతో అంద‌రూ త‌న ఉద్యోగం గురించి ఆరా తీస్తున్నారు. అత‌డు రిల‌య‌న్స్ కంపెనీలో మేనేజ‌ర్ పొజిషన్ లో జాబ్ చేస్తున్నాడ‌న్న నివేదిక‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఓర్రీ ఇప్పుడు మ‌రో ఘ‌న‌త‌ను సాధించ‌బోతున్నాడు. ఇంత‌లోనే ఓర్హాన్ అవత్రమణి.. సల్మాన్ ఖాన్ రియాల్టీ షోలో తన ఎంట్రీని కన్ఫర్మ్ చేశాడు. 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్‌లో షోలోకి ప్రవేశించాలని గాసిప్స్ వినిపించ‌గా, అతడు బిగ్ బాస్ సెట్స్‌పైకి వచ్చినప్పుడు స్పాట్ లో కెమెరామెన్ల‌తో ఇంటరాక్ట్ అయ్యాడు.

దీంతో ఓర్రీ బిగ్ బాస్ సీజన్ 17లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ప్రవేశిస్తారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. సోషల్ మీడియా స్టార్ ఓర్రీ ప్ర‌ముఖ‌ మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రత్యేక అభ్యర్థన చేసాడు. BB 17లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌డంపై హింట్ ఇస్తూ... షో నుండి అతనికి ఓటు వేయవద్దని కోరాడు. ఓర్రీ తన వానిటీ వైపు వెళ్లే ముందు కెమెరాల‌కు ఫోజులిస్తూ వారితో ముచ్చ‌టించాడు. ఈ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా కనిపించనున్నాడా? అంటే.. ప్రొడక్షన్ హౌస్ ఈ ఊహను అధికారికంగా ధృవీకరించలేదు. అయితే బిగ్ బాస్ సెట్ ప‌రిస‌రాల్లో ఓర్రీ కస్టమైజ్ టీష‌ర్ట్‌ని ధరించాడు. దానిపై 'ఐ యామ్ ఎ లివర్' అని రాసి ఉంది. బిగ్ బాస్ 17 సెట్స్ వెలుపలి నుండి వచ్చిన ఈ వీడియో కొద్దిసేపటికే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఓర్రీ త‌న‌దైన హాస్య చ‌తుర‌త‌, స్పాంటేనియాసిటీతో యువ‌త‌రం స్టార్ల మ‌నసులు కొల్ల‌గొట్టాడ‌ని ఇంత‌కుముందు ప‌లువురు అందాల క‌థానాయిక‌లు కితాబివ్వ‌డం ఆస‌క్తిక‌రం.

బిగ్ బాస్ 17 ఎలిమినేషన్, ఓటింగ్ ఫలితాల ఏమిట‌న్న‌ది ప‌రిశీలిస్తే.. ప్రస్తుత వారంలో ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. అంకితా లోఖండే, అనురాగ్ దోభాల్, సనా రయీస్ ఖాన్, జిగ్నా వోరా, సన్నీ ఆర్య డేంజర్ జోన్‌లో ఉన్నారు. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు నిర్వహిస్తున్న తాజా ఓటింగ్ ట్రెండ్‌లు పోల్‌లు అంకితా లోఖండే ప్రేక్షకుల నుండి గరిష్ట ఓట్లను పొందినట్లు సూచిస్తున్నాయి. సనా రయీస్ ఖాన్, జిగ్నా వోరా, సన్నీ ఆర్య మొదటి రెండు కంటెస్టెంట్స్- అంకిత - UK07 రైడర్‌లతో పోలిస్తే తక్కువ ఓట్లను అందుకున్నందున అట్టడుగు మూడు స్థానాల్లో ఉన్నారు. సోనియా బన్సాల్, నిధి షా - అంజలి అరోరా వంటి వైల్డ్‌కార్డ్స్ ఎంట్రీ గురించి పుకార్ల మధ్య బిగ్ బాస్ సీజన్ 17 నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.