Begin typing your search above and press return to search.

ఓర్నీ ఇదేం ప‌ని? ఊర్ఫీకి టైట్ హ‌గ్గిచ్చి కిస్ కొట్టేసిన ఓర్రి!

ఓర్రీతో ఉర్ఫీ జావేద్ పార్టీ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పార్టీ నైట్ లో ఉర్ఫీ జావేద్ స్టార్ కిడ్స్ అనన్య పాండే, సుహానా ఖాన్ ల‌తో చాలా స‌మ‌యం గ‌డిపింది.

By:  Tupaki Desk   |   9 Jun 2024 7:57 AM GMT
ఓర్నీ ఇదేం ప‌ని? ఊర్ఫీకి టైట్ హ‌గ్గిచ్చి కిస్ కొట్టేసిన ఓర్రి!
X

స్టార్ కిడ్స్ తో పార్టీ మూడ్ లో ఉండే ఓర్రి అలియాస్ ఓర్హాన్ అవ్ర‌త‌మ‌ణి నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో సంచ‌ల‌నంగా మారుతున్నాడు. బాలీవుడ్ స్టార్ కిడ్స్ తో పాటు స్టార్ హీరోయిన్ల‌తోను అత‌డు స‌న్నిహితంగా ఉండ‌డంతో అంద‌రి దృష్టి అత‌డిపైనే.. ప్ర‌జ‌ల‌కు ఎవ‌రీ ఓర్రీ? అంటూ చాలా సందేహాలు క‌లిగాయి. చివ‌రిగా అత‌డు రిల‌య‌న్స్ అంబానీల కంపెనీలో ఒక ఉద్యోగి అని, అత‌డికి హిందీ చిత్ర‌సీమ‌తో ద‌గ్గ‌ర సంబంధాలున్నాయని వెల్ల‌డైంది. అంతేకాదు.. ఓర్రీకి హిందీ చిత్ర‌సీమ సెల‌బ్రిటీ ఫంక్ష‌న్ల‌లో మంచి డిమాండ్ ఉంది. అత‌డు ప్ర‌తిసారీ పార్టీల్లో స్టార్ కిడ్స్ తో క‌నిపించ‌డం వెన‌క చాలా కార‌ణాలు ఉన్నాయి. అది అత‌డికి సంపాద‌న మార్గం అని తేలింది. అంతేకాదు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుక‌ల్లోను ఓర్హాన్ అవ్ర‌త‌మ‌ణి ఒక అతిథిగా మెరుస్తుండ‌డంతో త‌న బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా చ‌ర్చ సాగుతోంది.

ఇదిలా ఉంటే స్టార్ కిడ్స్ మెరుపులు మెరిపించిన ఓ నైట్ పార్టీలో ఓర్రీ ప్ర‌ముఖ మోడ‌ల్ కం న‌టి ఉర్పీ జావేద్ కి టైట్ హ‌గ్ ఇచ్చి కిస్ కొట్టేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఓర్హాన్ స్వ‌త‌హాగానే గాళ్స్ అంద‌రికీ మంచి స‌న్నిహితుడు. కానీ ఊర్ఫీకి ఇచ్చిన హ‌గ్ ప్ర‌త్యేకంగా ఈవెంట్లో హైలైట్ అయింద‌ని ఫోటోలు చెబుతున్నాయి. ఈ పార్టీలో స్టార్ కిడ్స్ అనన్య పాండే, సుహానా ఖాన్ వంటి వారు ఉన్నారు. ఓర్రీతో ఉర్ఫీ జావేద్ పార్టీ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పార్టీ నైట్ లో ఉర్ఫీ జావేద్ స్టార్ కిడ్స్ అనన్య పాండే, సుహానా ఖాన్ ల‌తో చాలా స‌మ‌యం గ‌డిపింది. ఆ ఇద్ద‌రితోను అత్యంత స‌న్నిహితంగా మెలిగిన ఫోటోలు వైర‌ల్ గా మారుతున్నాయి. ఇక పార్టీలో ఓర్హాన్ తో కలిసి ఉర్ఫీని చూసి అభిమానులు థ్రిల్ అయ్యారు.

బిగ్ బాస్ OTT ఫేమ్ ఊర్ఫీ అనన్య పాండేతో క‌లిసి ఉన్న ఓ ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. 'క్యూట్ హై లడ్కీ @ అనన్యపాండే' అని రాశారు. అనన్య ఈ ఫోటోను మళ్లీ షేర్ చేసి, 'అదే చిటికెడు' అని రాసింది. అనన్య తన బెస్ట్టీ సుహానా ఖాన్‌తో కలిసి స్టైలిష్ ఫోటోను కూడా షేర్ చేసింది. ఆ ఇరువురు ఒకరినొకరు కౌగిలించుకుని పోజులిచ్చారు. ఓర్రీ ఉర్ఫీని ముద్దుపెట్టుకున్న ఫోటో ప్ర‌త్యేకంగా వైరల్ అయింది. ఈ ఫోటోని షేర్ చేస్తూ.. ఉర్ఫీ ఇలా రాసారు. ఓరీ ఈ వ్యక్తిని చాలా ప్రేమిస్తున్నాను.. అని పేర్కొంది. అలాగే షారూఖ్ కుమార్తె సుహానా ఖాన్ తోను ఉర్ఫీ స‌న్నిహితంగా ఉన్న మ‌రో ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. వీట‌న్నిటి నడుమా ఉర్పీతో ఓర్రీ కెమిస్ట్రీ అద్భుతంగా వ‌ర్క‌వుటైంద‌ని నెటిజ‌నులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.