Begin typing your search above and press return to search.

ట్రంప్ అయినా ఆగ‌లేడు ఊర్వ‌శిని చూడ‌గానే!

తాజాగా త‌న‌పై ట్రోలింగ్ గురించి ఒర్రీ స్పందించాడు. ఊర్వ‌శిపై ఆ రోజు అలా జ‌ర‌గడానికి కారణం ప్ర‌తీకారం అని అన్నాడు.

By:  Tupaki Desk   |   16 April 2025 5:00 PM IST
ట్రంప్ అయినా ఆగ‌లేడు ఊర్వ‌శిని చూడ‌గానే!
X

సోషల్ మీడియా సంచలనం ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవత్రమణి ఇటీవల జరిగిన ఒక పార్టీలో ఊర్వశి రౌతేలాను నెట్టేయ‌గా, తాను బ్యాలెన్స్ త‌ప్పి ప‌క్క‌నే ఉన్న డీజేపై ప‌డ‌బోయిన సంగ‌తి తెలిసిందే. అత‌డు ఊర్వ‌శిని నెట్టేయ‌డ‌మే కాకుండా, ఆ త‌ర్వాత గ‌ట్టిగా హ‌గ్ చేసుకుని వేయ‌కూడ‌ని చోట చేయి వేసాడు. ఈ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతో ఒర్రీపై నెటిజ‌నులు విరుచుకుప‌డ్డారు. అత‌డు ఘోర త‌ప్పిదం చేసాడంటూ చాలామంది నిల‌దీసారు.

తాజాగా త‌న‌పై ట్రోలింగ్ గురించి ఒర్రీ స్పందించాడు. ఊర్వ‌శిపై ఆ రోజు అలా జ‌ర‌గడానికి కారణం ప్ర‌తీకారం అని అన్నాడు. ప్రతీకారం తీర్చుకోవాలని `దబిది దిబిది` పాటకు డ్యాన్స్ చేస్తూ ఆమెను నెట్టివేసినట్లు వెల్లడించాడు. ఊర్వశి అద్భ‌త‌మైన శారీరక ఆకర్షణతో పార్టీలో ప్రవేశించిందని, స్పాట్ లైట్ ని దొంగిలించింద‌ని ఓర్రీ గుర్తుచేసుకున్నాడు. పార్టీలో తాను హోస్ట్‌గా ఉన్నప్పటికీ ఊర్వశి తన ఆక‌ర్ష‌ణ‌తో అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పాడు. ఆమె క్ల‌బ్ లో ప్ర‌వేశించాక ఏమిటీ న‌ర‌కం అని అనుకున్నాను అని అన్నాడట‌. ఆ క్ష‌ణంలో డొనాల్డ్ ట్రంప్ అయినా ఊర్వ‌శిని ఫోన్ లో ఫోటో తీస్తార‌ని కూడా వ్యాఖ్యానించాడు.

ఊర్వశి పార్టీలో ప్రవేశించినప్పుడు అతను కూడా వీడియో రికార్డ్ చేయకుండా తనను తాను నిలువ‌రించుకోలేక‌పోయాన‌ని అన్నాడు. స్పాట్‌లైట్ ఎంట్రీ తర్వాత, ఊర్వశి తన `దబిది దిబిది` పాటతో నృత్యం చేస్తున్నప్పుడు తాను ఆమెపై ప్రతీకారం తీర్చుకున్నానని ఓర్రీ పేర్కొన్నాడు.

త‌మ‌న్నాను అన్నందుకు:

తాజాగా ఊర్వశి రౌతేలా `జాత్` చిత్రంలోని `సారీ బోల్` పాట గురించి ప్ర‌స్థావించింది. ఈ పాట‌కు వ‌చ్చిన ట్రోలింగ్ గురించి మాట్లాడింది. అయితే రైడ్ 2లోని తమన్నా భాటియా `నషా` పాటతో తన పాటను పోలుస్తూ మాట్లాడిన విష‌యాలు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి. అయితే ఈ ఇన్ స్టా రీల్ ను వెంట‌నే తొల‌గించింది. న‌షా కంటే సారీ బోల్ పాట చాలా బావుంద‌ని ఒక అభిమాని వ్యాఖ్యానించిన విష‌యాన్ని కూడా ప్ర‌స్థావించారు. ఊర్వశి ఆ త‌ర్వాత దానిని తొలగించారు. కానీ అది రెడ్డిట్‌లో వేగంగా షేర్ అయింది. దీనిపై ఊర్వ‌శి చాలా విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంది. ఈ భామ అహంకారి అని కూడా తిట్టారు. ఊర్వ‌శి ఇత‌ర న‌టీమ‌ణుల‌ను త‌క్కువ చేసి చూపించ‌డంపై కొన్ని తిట్లు చీవాట్లు ఎదుర్కొంటోంది.