నటీమణులతో ఇన్‌ఫ్లూయెన్సర్ తప్పుడు ప్రవర్తన
అయితే ఒర్రీ బావ అలాంటి రెండు తప్పులు ఊర్వశి రౌతేలా విషయంలో చేసి దొరికిపోయాడు.
By: Tupaki Desk | 11 April 2025 1:00 AM ISTఇతరులతో సరదాలు, పరాచికాలకు ఒక హద్దు అనేది ఉంటుంది. ఒకప్పుడు బావ మరదళ్ల సరసాలుండేవి. కానీ కొన్ని హద్దులు స్పష్ఠంగా ఉండేవి. బావ ఎంతవరకూ మరదలిని ఆటపట్టించాలో అంతవరకే.. ఆపై ఇంకేదైనా జరిగితే అతడిదే పూచీ.
కానీ ఇక్కడ బావ హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు. అవసరం ఉన్నా లేకపోయినా గట్టిగా కౌగిలించుకుంటున్నాడు. ఒక్కోసారి పార్టీలోనే పదిమందిలో మీద చెయ్యేసి తోసేస్తున్నాడు. ఇది కొంచెం మోటు సరసమే అయినా ఒక్కోసారి అదుపు తప్పి కింద పడబోయే పరిస్థితి.
అయితే ఒర్రీ బావ అలాంటి రెండు తప్పులు ఊర్వశి రౌతేలా విషయంలో చేసి దొరికిపోయాడు. దుబాయ్‌లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో ఊర్వశి రౌతేలాని గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఊర్వశి షాక్ కి గురవ్వడమే గాక అది ఊహించనట్టుగా ఫేస్ పెట్టింది. ఆ తర్వాత పరిస్థితులు ఊహించని మలుపు తిరిగాయి. ఊర్వశి అసౌకర్యానికి గురైన విషయం చూస్తున్నవారికి అర్థమవుతూనే ఉంది.
అంతటితో ఆ మ్యాటర్ అయిపోలేదు. కొన్ని రోజుల తర్వాత ఊర్వశి పుట్టినరోజు వేడుకలో వైరల్ డ్యాన్స్ మూవ్ మెంట్స్ ని ఓర్రీ రిపీట్ చేసాడు. ఈ నృత్య ప్రదర్శన సమయంలో అతడు ఊర్వశిని సరదాగా నెట్టాడు. అయితే ఆ సమయంలో అదుపు తప్పిన ఊర్వశి తూలి పడబోయింది. ఈ సరసం చూడగానే హద్దులు దాటిపోయిందని అందరికీ అర్థమైంది. ఒర్రీ అత్యుత్సాహంలో అలా చేసేసినా కానీ, ఊర్వశి ఆ రెండు సందర్భాల్లో ఇబ్బందులకు గురైంది. బావ మోటు సరసం చాలా ఇబ్బందికరంగా మారింది. ``నేను నెట్టేసిన మొట్టమొదటి మహిళ`` అంటూ అతడు దీనికి క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
అయితే దీనిపై ఎవరూ సరిగా స్పందించలేదు. దీనికి స్పందించిన యువనటి అనన్య పాండే, ``నువ్వు నన్ను ఇంతకు ముందు నెట్టేశావు`` అని జోక్ చేసింది. కానీ చాలామంది ఆ చర్యను ఖండించారు. మగువలతో ప్రవర్తన విషయంలో ఓర్రీ తప్పు చేస్తున్నాడని అందూ గుర్తిస్తున్నారు. అతడు పార్టీల్ల సరదాగా అందరితో స్పెండ్ చేసినా కానీ, ఇతరులను ఇబ్బంది పెట్టేలా అతి చేయకూడదని సూచిస్తున్నారు. ఊర్వశి నటించిన జాత్ త్వరలో విడుదల కానుంది.
