Begin typing your search above and press return to search.

ఓర్మాక్స్ స‌ర్వే: స‌మంత క్రేజ్ ఇంకా స్కైలోనే

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి ప్ర‌మోటైన స‌మంత రూత్ ప్ర‌భు ఇటీవ‌ల హిందీ చిత్రాల‌కు సంత‌కాలు చేసార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

By:  Tupaki Desk   |   23 Oct 2023 12:52 PM GMT
ఓర్మాక్స్ స‌ర్వే: స‌మంత క్రేజ్ ఇంకా స్కైలోనే
X

పాపుల‌ర్ ఓర్మాక్స్ స‌ర్వే 2023 రిపోర్ట్ లో కింగ్ ఖాన్ షారూఖ్ 1వ స్థానంలో నిల‌వ‌గా, ప్ర‌భాస్ 2వ స్థానం అందుకున్న సంగ‌తి తెలిసిందే. టాప్ 10లో న‌లుగురు తెలుగు అగ్ర‌హీరోలు ఉన్నారు. అయితే ద‌క్షిణాదికి చెందిన హీరోయిన్ల‌లో ఎంత మంది ఈ స‌ర్వేలో టాప్ 10లో నిలిచారు? అన్న‌ది ఆరా తీస్తే..


స‌ర్వే నివేదిక‌ల ప్ర‌కారం.. భార‌త‌దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క‌థానాయిక‌ల‌ జాబితాలో అలియా భట్ మొదటి స్థానంలో నిల‌వ‌గా, ఆ త‌ర్వాతి స్థానంలో సమంతా రూత్ ప్రభు నిలిచింది. ఆ త‌ర్వాత‌ దీపికా పదుకొణె, నయనతార టాప్ 5లో నిలిచారు. కియ‌రా అద్వాణీ, క‌త్రిన‌, కాజ‌ల్, త్రిష‌, త‌మ‌న్నా, కృతి స‌నోన్ టాప్ 10లో నిలిచారు. సౌత్ నుంచి స‌మంత‌, న‌య‌న‌తార‌, కాజ‌ల్, త‌మ‌న్నా జాబితాలో నిల‌వడం ఆస‌క్తిక‌రం.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి ప్ర‌మోటైన స‌మంత రూత్ ప్ర‌భు ఇటీవ‌ల హిందీ చిత్రాల‌కు సంత‌కాలు చేసార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఓవైపు మ‌యోసైటిస్ లాంటి ఇబ్బందిక‌ర స‌మ‌స్య‌కు ప‌రిష్కారం వెతుకుతూనే కెరీర్ ప‌రంగా ఫోక‌స్ చేయ‌డంలో స‌మంత అంద‌రిలో స్ఫూర్తిని నింపుతోంది. ఊ అంటావా గీతంతో ఇదే స‌ర్వేలో అగ్ర‌ప‌థం అందుకున్న స‌మంత ఇప్ప‌టికీ త‌న స్థానాన్ని ప‌దిల‌ప‌రుచుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించేదే.

ఇప్పుడు ఆలియా నంబ‌ర్ 1 స్థానంలో ఉన్నా కానీ, నంబ‌ర్ 2గా స‌మంత త‌న స్థానాన్ని నిల‌బెట్టుకోవ‌డం పెరుగుతున్న త‌న ఇమేజ్ ని ఎలివేట్ చేయ‌డ‌మే. స‌మంత న‌టించిన ఒకే ఒక్క సినిమా 'ఖుషి' విడుద‌లైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించినంత‌గా ఆడ‌లేదు. కానీ స‌మంత న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది.

రాజ్ అండ్ డీకేతో ఫ్యామిలీమ్యాన్ 2, అలాగే సిటాడెల్ ఇండియా వెర్ష‌న్ లో న‌టిస్తూ స‌మంత నిరంత‌రం వార్త‌ల్లో నిలిచింది. ఆ క్రేజ్ ఇప్ప‌టికీ గొప్ప ప్ర‌జాద‌ర‌ణ ఉన్న న‌టిగా స‌మంత‌ను లైమ్ లైట్ లో ఉంచుతోంది.