Begin typing your search above and press return to search.

ఎంతమంది వచ్చినా ఆ హీరోయిన్ టాప్, అంతే!

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ సమంత

By:  Tupaki Desk   |   15 May 2024 5:04 PM GMT
ఎంతమంది వచ్చినా ఆ హీరోయిన్ టాప్, అంతే!
X

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ సమంత. ఈ అమ్మడు 2010లో ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరిసాగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోలతో జత కట్టింది. కమర్షియల్ సినిమాలతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారిపోయింది.

ఈమె సుదీర్ఘ సినీ కెరియర్ లో గ్లామర్ రోల్స్ తో పాటు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలని కూడా చేసింది. ఓ బేబీ సినిమాతో ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేసి సూపర్ సక్సెస్ అందుకుంది. గత ఏడాది ఈ బ్యూటీ శాకుంతలం, ఖుషి సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వీటిలో శాకుంతలం డిజాస్టర్ కాగా ఖుషి ఏవరేజ్ గా నిలిచింది. మాయోసైటిస్ బారిన పడి గత కొన్నేళ్లుగా ఆమె సినిమాలు పెద్దగా చేయడం లేదు. ప్రస్తుతం సమంత చేతిలో ఎలాంటి సినిమాలు లేవు.

అయిన కూడా సోషల్ మీడియాలో సమంత నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకి దగ్గరగా ఉంటుంది. అందుకే సమంత ఇప్పటికి మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రతి నెల ఆర్మాక్స్ మీడియా సంస్థ టాప్ 10 హీరోయిన్స్ జాబితాని ప్రకటిస్తూ ఉంటుంది. అభిమానుల ఓటింగ్ ఆధారంగా సోషల్ మీడియాలో ఈ సర్వే చేస్తూ టాప్ 10 హీరోయిన్స్ ని ఆర్మాక్స్ ప్రకటిస్తూ ఉంటుంది.

ఏప్రిల్ నెలకి గాను ఆర్మాక్స్ టాప్ 10 పాపులర్ హీరోయిన్స్ జాబితాలో నెంబర్ వన్ గా సమంత ఉంది. గత కొన్నేళ్లుగా ఆమె టాప్ 1 హీరోయిన్ గానే కొనసాగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్స్ గా రష్మిక, శ్రీలీల లాంటి భామలు ఉన్నారు. రష్మిక అయితే పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. కానీ పాపులారిటీ పరంగా సమంతని మాత్రం ఆమె బ్రేక్ చేయలేకపోతోంది.

మోస్ట్ పాపులర్ జాబితాలో టాప్ 2గా కాజల్ అగర్వాల్ నిలవడం విశేషం. ఈ అమ్మడు సత్యభామ అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతోంది. టాప్ 3లో స్వీటీ అనుష్క శెట్టి ఉంది. నిజానికి సోషల్ మీడియాలో అనుష్క అంత యాక్టివ్ గా ఉండదు. అయిన కూడా మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ లో టాప్ 3గా నిలిచింది. క్రేజీ హీరోయిన్ శ్రీలీల పాపులర్ హీరోయిన్స్ లో టాప్ 4గా నిలవడం విశేషం.

ఇక ఈ జాబితాలో టాప్ 5 పైగా భానుమతి సాయి పల్లవి నిలిచింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆమె ఈ ఏడాది తండేల్ మూవీలో నాగచైతన్యకు జోడిగా నటిస్తుంది. టాప్ 6లో పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా ఉంది. టాప్ 7గా తమన్నా భాటియా నిలవడం గమనార్హం. ఈమె తాజాగా బాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాప్ 8లో కీర్తి సురేష్ స్థానం సంపాదించుకుంది. ఆమె చివరిగా తెలుగులో గత ఏడాది దసరా, భోళా శంకర్ చిత్రాలలో నటించింది. 9వ స్థానంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే, 10వ స్థానంలో టిల్లు స్క్వేర్ తో గ్రాండ్ సక్సెస్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ ఉన్నారు.