Begin typing your search above and press return to search.

ఆరెంజ్ డైరెక్టర్.. మళ్ళీ అదే రిస్క్

దీంతో సుదీర్ఘ విరామం తీసుకొని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అంటూ అఖిల్ తో హిట్ కొట్టాడు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 3:39 AM GMT
ఆరెంజ్ డైరెక్టర్.. మళ్ళీ అదే రిస్క్
X

బొమ్మరిల్లు సినిమానే ఇంటిపేరుగా మార్చికున్న బొమ్మరిల్లు భాస్కర్ తరువాత పరుగు మూవీతో మరో సూపర్ హిట్ కొట్టారు. అయితే మూడో సినిమా ఆరెంజ్ అతనికి చాలా కాలం అడ్రెస్ లేకుండా చేసింది. ఒంగోలు గిత్తా అంటూ మాస్ అటెంప్ట్ చేసి నిలబడే ప్రయత్నం చేసిన వర్క్ అవుట్ కాలేదు. దీంతో సుదీర్ఘ విరామం తీసుకొని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అంటూ అఖిల్ తో హిట్ కొట్టాడు.

ఈ మూవీ లవ్ అండ్ ఫ్యామిలీ కంటెంట్ తోనే తెరకెక్కింది. అఖిల్ కెరియర్ లో చెప్పుకోదగ్గ హిట్ మూవీగా ఈ సినిమా నిలిచింది. దీని తర్వాత నెక్స్ట్ సినిమా కోసం మళ్ళీ బొమ్మరిల్లు భాస్కర్ చాలా టైం తీసుకున్నారు. గీతా ఆర్ట్స్ లో మూవీ చేస్తాడని ప్రచారం జరిగింది. అలాగే చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి. అయితే గత కొంతకాలం నుంచి సిద్ధూ జొన్నలగడ్డతో ఒక మూవీ ఉంటుందనే టాక్ బయటకొచ్చింది.

ఈ మధ్య మంచి కంటెంట్ బేస్డ్ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కథలతో సక్సెస్ లు అందుకుంటూ సిద్ధూ జొన్నలగడ్డ లీడ్ లోకి వచ్చాడు. డీజే టిల్లు అతన్ని స్టార్ గా మార్చేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్ టిల్లు స్క్వేర్ చేస్తున్నాడు. మరో వైపు నీరజ కోన డెబ్యూ చేస్తోన్న తెలుగు కదా అనే మూవీలో హీరోగా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మొదలైంది.

తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. బివీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. తాజాగా ఈ సినిమాని డిఫరెంట్ స్టైల్ లో ఎనౌన్స్ చేశారు. నిర్మాత, హీరో, దర్శకుడు ఒక ఫోటోకి ఫోజు ఇచ్చారు. అందులో భాస్కర్ చేతిలో గన్ ఉండటంతో ఈ మూవీ మాస్ టచ్ లో ఉంటుందనే టాక్ బయటకొచ్చింది.

అయితే సిద్ధూ అంటే కామెడీకి కేరాఫ్ గా మారిపోయాడు. అలాంటి హీరోతో మాస్ మూవీ ఉంటే కచ్చితంగా ఏదో కొత్తగానే ఉంటుందనే మాట వినిపిస్తోంది. కాని బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పటికే ఒంగోలు గిత్తా అంటూ మాస్ మూవీ ట్రై చేసి డిజాస్టర్ కొట్టారు. అతనికి క్లాస్ సినిమాలే సక్సెస్ ఇచ్చాయి. ఈ సారి సిద్ధూ కోసం భాస్కర్ ఎలాంటి కథ రాసాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.